Advertisement
Advertisement
Abn logo
Advertisement

యువతిపై పెట్రోలుతో దాడి ఘటనపై సీఎం ఆరా

అమరావతి: విజయనగరం జిల్లాలో యువతిపై పెట్రోలుతో దాడి ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. మెరుగైన వైద్యం కోసం విశాఖ తరలించాలని సీఎం ఆదేశించారు. ఘటనకు సంబంధించిన వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. బాధితురాలి ఆరోగ్యం నిలకడగా ఉందని జగన్‌కు అధికారులు వివరించారు. బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలబడాలని మంత్రి బొత్స సత్యనారాయణకు సీఎం అదేశించారు. నిందితుడిపై కఠినచర్యలు తీసుకోవాలని జగన్ చెప్పారు. బాధితురాలిని మంత్రి బొత్స సహా డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, అధికారులు పరామర్శించారు. యువతిపై పెట్రోల్ దాడి ఘటన దురదృష్టకరమని మంత్రులు పుష్ప శ్రీవాణి, బొత్స సత్యనారాయణ అన్నారు. తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమని చెప్పారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడన్నారు. దిశ యాప్ కారణంగానే బాధితులను సకాలంలో కాపాడగలిగామని తెలిపారు. యాప్ నుంచి సమాచారం వచ్చిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను రక్షించారని మంత్రులు చెప్పారు. 

Advertisement
Advertisement