బెయిల్ బ్యాచ్.. MP Raghurama సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-07-27T21:22:52+05:30 IST

బెయిల్ బ్యాచ్ అంతా కలిసి నీతులు వల్లిస్తున్నారని నర్సాపురం ఎంపీ రఘురామరాజు మండిపడ్డారు. ముగ్గురు బెయిల్ ఆర్టిస్టులు కలిసి నిర్మలా సీతారామన్‌కు ఫిర్యాదు చేశారని విమర్శించారు.

బెయిల్ బ్యాచ్.. MP Raghurama సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ: బెయిల్ బ్యాచ్ అంతా కలిసి నీతులు వల్లిస్తున్నారని నర్సాపురం ఎంపీ రఘురామరాజు మండిపడ్డారు. ముగ్గురు బెయిల్ ఆర్టిస్టులు కలిసి నిర్మలా సీతారామన్‌కు ఫిర్యాదు చేశారని విమర్శించారు. సీబీఐ విచారణలో బండారం బయట పడుతుందన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం తమ సామాజికవర్గానికి .. ఇష్టానుసారంగా ఉద్యోగాలు కేటాయిస్తోందని ఆరోపించారు. ఆవ భూముల్లో సీఎం బాబాయ్ పాత్ర కూడా ఉందన్నారు. రూ.130 కోట్లు ఎవరు కొట్టేశారో.. కొట్టేసిన వారి దగ్గర నుంచి... ఇంకెవరు కొట్టేశారో కూడా అందరికి తెలుసన్నారు. ఆవ భూముల కుంభకోణంపై ప్రధానికి లేఖ రాశానని ఎంపీ రఘురామరాజు అన్నారు. 


సునీల్ కుమార్ అనే అధికారి భార్య వ్యక్తిగత కంప్యూటర్ నుంచి ఇతరలకు మెస్సేజ్ చేశారని విమర్శలు గుప్పించారు. అలాంటి వ్యక్తిపై గృహహింస కేసు కూడా నమోదైందని.. నిందితుడు అని కూడా తేలిందన్నారు. తన ఫోన్ దొంగలించి.. దాన్ని ఉపయోగించి వేరే వారికి మెస్సేజ్‌లు చేసి ఇప్పుడు తనపైనే కేసులు నమోదు చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విచ్చలవిడిగా పెగసెస్ వాడుతోందని, గతంలో కూడా వార్తలు వచ్చాయన్నారు. సునీల్  కుమార్ వేసిన పిటిషన్ సాక్షికి ఎలా వచ్చిందన్నారు. సునీల్ కుమార్ ఒక జాయింట్ డైరెక్టర్ ఈడీకి పిర్యాదు చేస్తే.. విజయసాయిరెడ్డికి పిటిషన్ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఈడీ జాయింట్ సెక్రటరీ గోయల్ పిటిషన్‌ను విజయసాయిరెడ్డికి ఎవరు ఇచ్చారో తేలాలన్నారు. A1 ముఖ్యమంత్రి అవుతారని నాలుగేళ్ల కింద ఊహించి ముందే ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూశానా? సునీల్ కుమార్ బెయిల్‌పై ఉన్నారు. సీబీ, సీఐడీ లీడ్ చేస్తున్నారు. 

Updated Date - 2021-07-27T21:22:52+05:30 IST