జగన్, విజయసాయిది కీలక పాత్ర: సీబీఐ

ABN , First Publish Date - 2021-11-09T02:31:17+05:30 IST

హైకోర్టులో జగన్ కేసుల విచారణ జరిగింది. హెటిరో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి క్వాష్ పిటిషన్‌పై సీబీఐ వాదనలు వినిపించింది. పెట్టుబడుల రూపంలో ...

జగన్, విజయసాయిది కీలక పాత్ర: సీబీఐ

హైదరాబాద్: హైకోర్టులో జగన్ కేసుల విచారణ జరిగింది. హెటిరో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి క్వాష్ పిటిషన్‌పై సీబీఐ వాదనలు వినిపించింది. పెట్టుబడుల రూపంలో ముడుపుల వసూళ్లకు జగన్ కుట్ర చేశారని సీబీఐ తెలిపింది. తండ్రి అధికారంతో లబ్ధి చేకూర్చి.. వారి నుంచి ముడుపులకు కుట్ర చేశారని పేర్కొంది. ముడుపుల రూపంలో పెట్టుబడుల సేకరణలో జగన్, విజయసాయి కీలక పాత్ర అని సీబీఐ స్పష్టం చేసింది. జగతి పబ్లికేషన్స్‌లో రూ.1246 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు చెప్పింది. జగన్ రూపాయి పెట్టకుండానే రూ.1246 కోట్ల పెట్టుబడులు రాబట్టారని, భూకేటాయింపులు, పెట్టుబడులను కలిపి చూస్తే కుట్ర బయటపడుతుందని, భూకేటాయింపుల ఫైలు కదిలికకు అనుగుణంగా పెట్టుబడులు వెళ్లాయని పేర్కొంది. హెటిరో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి ప్రమేయంపై ఆధారాలున్నాయని సీబీఐ తెలిపింది. హెటిరో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి క్వాష్ పిటిషన్‌పై విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. 

Updated Date - 2021-11-09T02:31:17+05:30 IST