Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎస్‌ఈబీపై సీఎం జగన్‌ సమీక్ష

అమరావతి: ఎస్‌ఈబీపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. మద్యం నియంత్రణలో భాగంగా రేట్లను పెంచామని సీఎం తెలిపారు. మూడింట ఒక వంతు దుకాణాలను మూసివేశామన్నారు. అక్రమ మద్యం తయారీ, రవాణాపై ఉక్కుపాదం మోపాలని చెప్పారు. నిర్దేశిత రేట్లకన్నా ఇసుకను ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. గంజాయి సాగు, రవాణాను అరికట్టాలని సీఎం జగన్‌ ఆదేశించారు. పోలీసు విభాగాలు సమన్వయంతో పనిచేయాలన్నారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. క్రమం తప్పకుండా వర్సిటీలు, కాలేజీలపై పర్యవేక్షణ ఉండాలన్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement