Abn logo
Oct 12 2021 @ 16:14PM

దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

విజయవాడ: ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారు సరస్వతి దేవి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దుర్గమ్మను దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు. సీఎం రాక సందర్భంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 

ఇవి కూడా చదవండిImage Caption