Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇడుపులపాయ చేరుకున్న సీఎం జగన్‌

వేంపల్లె, అక్టోబరు 2: రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగనమోహనరెడ్డి శనివారం సాయంత్రం 4:42 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో కడప నుంచి ఇడుపులపాయకు చేరుకున్నారు. హెలీప్యాడ్‌ స్థలం వద్ద ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేష్‌, ఎమ్మెల్యేలు మేడా మల్లికార్జునరెడ్డి, రఘురామిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 50 మందికి పైగా స్థానిక నేతలను జగన కలిసి మాట్లాడారు. వేంపల్లెకు జూనియర్‌ కళాశాల మంజూరు చేయాలని, వెనుకబడిన తరగతుల బాలుర, బాలికల రెసిడెన్షియల్‌ పాఠశాల మంజూరు చేయాలని, షెడ్యూల్డ్‌ కులాల విద్యార్థులకు హాస్టల్‌ సౌకర్యం కల్పించాలని జడ్పీటీసీ రవికుమార్‌రెడ్డి సీఎంకు విన్నవించగా సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. 


రాత్రి ఇడుపులపాయలోనే బస

ముఖ్యమంత్రి వైఎస్‌ జగనమోహనరెడ్డి శనివారం రాత్రి ఇడుపులపాయలోనే బస చేశారు. సాయంత్రం 4:42 గంటలకు ఇడుపులపాయకు చేరుకున్న జగన 50 నిమిషాలు స్థానిక నేతలతో హెలీప్యాడ్‌ స్థలం వద్ద మాట్లాడిన అనంతరం 5:30 గంటలకు విశ్రాంతి భవనానికి చేరుకున్నారు. ఆయనతో మంత్రి ఆదిమూలపు సురేష్‌ కాసేపు చర్చించి వెళ్లారు. ఆదివారం ఉదయం ఇడుపులపాయ నుంచి పులివెందులకు సీఎం వెళ్లనున్నారు. 

Advertisement
Advertisement