చదువే ‘కానుక’

ABN , First Publish Date - 2022-07-06T08:48:19+05:30 IST

‘‘పేద విద్యార్థులు ప్రపంచంతో పొటీపడేలా నాణ్యమైన, ఇంగ్లీష్‌ చదువు అందించాలన్నదే నా సంకల్పం.. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువు మాత్రమే’’

చదువే ‘కానుక’

అదే పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి.. విద్యారంగంలో మెరుగైన మార్పులు 

ఆదోని సభలో సీఎం జగన్‌ వెల్లడి

మూడో విడత విద్యాకానుక పంపిణీ

విద్యార్థుల సభలో మందుబాబుల సందడి

సభకు వచ్చేవారివద్ద కర్ణాటక మద్యం పట్టివేత 


కర్నూలు, జూలై 5(ఆంధ్రజ్యోతి)/ఆదోని: ‘‘పేద విద్యార్థులు ప్రపంచంతో పొటీపడేలా నాణ్యమైన, ఇంగ్లీష్‌ చదువు అందించాలన్నదే నా సంకల్పం.. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువు మాత్రమే’’ అని సీఎం జగన్‌ అన్నారు. కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్‌ మైదానంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో 3వ విడత విద్యా కానుక కిట్లు పంపిణీ చేశారు. ‘‘ఈ మూడేళ్లలో విద్యారంగంలో మార్పులు తెచ్చాం. రేపటితరం పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే సంకల్పంతోనే అమ్మఒడి, విద్యా కానుక, ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, విద్యాదీవెన, వసతిదీవెన వంటి పథకాలు అమలు చేస్తున్నాం’’ అని జగన్‌ వివరించారు. విద్యాకానుక ఖర్చు పెరిగినా వెనకాడకుండా అందిస్తున్నామన్నారు. ‘‘2020 -21లో విద్యాకానుకలో ఒక్కో కిట్‌ రూ.1,531చొప్పున 42.34 లక్షల మంది విద్యార్థులకు రూ.650కోట్లు ఖర్చు చేశాం. 2021- 22లో ఒక్కో కిట్‌ రూ.1,726 చొప్పున 45.71లక్షల మంది విద్యార్థులకు రూ.790 కోట్లు వ్యయం చేశారు. ఈ ఏడాది 47లక్షల మంది విద్యార్థులకు ఒక్కో కిట్‌ రూ.1,964 చొప్పున రూ.950 కోట్లు ఖర్చు  చేశాం’’ అని సీఎం వివరించారు. 


బైజూస్‌తో ఒప్పందం..

8వ తరగతి విద్యార్థులకు నాణ్యమైన ఇంగ్లీష్‌ విద్య అందించాలనే లక్ష్యంతో 4.70లక్షల విద్యార్థులకు ట్యాబులు అందిస్తున్నామని సీఎం చెప్పారు.. ఒక్కో ట్యాబ్‌ విలువ రూ.19వేలని, ఇందుకోసం రూ.500 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. సెప్టెంబరులో వీటిని పంపిణీ చేస్తామన్నారు. ప్రపంచ స్థాయిలో పిల్లలు పోటీ పడేలా ఆన్‌లైన్‌ ట్యూషన్‌ చెప్పించుకునేందుకు బైజూ్‌సతో ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. 2025 నాటికి మన పిల్లలు సీబీఎస్సీ సిలబ్‌సలో ఇంగ్లీ్‌షలో పోటీ పడాలన్నదే తన సంకల్పమన్నారు. విద్యారంగంలో తీసుకొచ్చిన మార్పుల వల్ల ప్రభుత్వ బడుల్లో చదివేవారు ప్రస్తు తం 7.20లక్షల మందికి చేరుకున్నారని సీఎం జగన్‌ అన్నారు. మూడేళ్లలో అమ్మఒడి పథకానికి 44 లక్షల మంది తల్లుల ఖాతాలో రూ.19,617కోట్లు జమ చేశామన్నారు.


ఉన్నత విద్య చదివే పిల్లల పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం రూ.21.25లక్షల తల్లుల ఖాతాల్లో రూ.7,700కోట్లు, వసతి దీవెనకు రూ.3,329 కోట్లు ఇచ్చామని తెలిపారు. గత చంద్రబాబు ప్రభుత్వం మధ్యాహ్నభోజనం కోసం రూ.550 కోట్లు ఖర్చు చేస్తే.. గోరుముద్దు పథకం ద్వారా పౌష్టికాహారం అందించాలని రూ.1850కోట్లు తమ ప్రభుత్వం ఖర్చు చేస్తోందని చెప్పారు. అంగన్‌వాడీ కేంద్రాలకు గత ప్రభుత్వం రూ.500కోట్లు ఖర్చు చేస్తే ఈ ప్రభుత్వం రూ.1950కోట్లు ఖర్చు చేసిందని సీఎం వివరించారు. విద్యాకానుక కోసం గత ప్రభుత్వం రూ.120కోట్లు వెచ్చిస్తే మన ప్రభుత్వం రూ.950 కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు. కాగా, ఆనాడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఫీజురీయింబర్స్‌మెంట్‌ తీసుకొస్తే.. ప్రస్తుత సీఎం జగన్‌ అమ్మఒడి ద్వారా రూ.6530కోట్లు తల్లుల ఖాతాలో జమ చేస్తున్నట్లు  విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.  


విద్యార్థి సంఘాల నేతలు అరెస్టు

కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంత అభివృద్ధికి నిధులు ఇవ్వాలని, ఆదోనిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు, పీడీఎ్‌సయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొడాలి నాగరాజు, రాష్ట్ర నాయకులు తిరుమల్లేశ్‌, ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షులు సాబీర్‌బాషాతో పాటు విద్యార్థులు సీఎంను కలిసేందుకు నినాదాలు చేస్తూ వేదిక వద్దకు వెళ్తుండగా... పోలీసులు అడ్డుకున్నారు.  అలాగే ఆదోని మండలం పాండవగళ్లు గ్రామానికి చెందిన డీవైఎ్‌ఫఐ కార్యకర్తలు, సీపీఐ నాయకులు సుదర్శన్‌, వెంకన్న, పశ్చిమ ప్రాంత అభివృద్ధి వేదిక కన్వీనర్‌ ఆదినారాయణరెడ్డిలను ముందస్తుగా నిర్భంధించారు.  


తప్పని ఇబ్బందులు

ఆదోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల మైదానంలోని హెలీప్యాడ్‌ వద్దకు చేరుకున్న సీఎం జగన్‌కు జిల్లా మంత్రి గుమ్మనూరు జయరాం, కర్నూలు ఎంపీ సంజీవకుమార్‌ తదితరులు స్వాగతం పలికారు. అక్కడినుంచి సభావేదిక అయిన మున్సిపల్‌ మైదానం వరకు సుమారు రెండు కిలోమీటర్ల  పొడవున ప్రధాన రహదారికి ఇరువైపుల భారీ ఇనుప గేట్లను ఏర్పాటు చేశారు. హౌసింగ్‌ బోర్డు కాలనీ, ఎన్జీవోల కాలనీ తదితర ప్రాంతాల్లో ఇళ్ల నుంచి జనం బయటకు రాకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో వ్యాపారులు నష్టపోవాల్సి వచ్చింది. 


వెళ్లిపోకుండా మహిళల అడ్డగింత.. 

జగనన్న విద్యాకానుక పంపిణీ కార్యక్రమానికి విద్యార్థులు, డ్వాక్రా మహిళలను భారీగా తరలించారు. సీఎం జగన్‌ ప్రసంగం ప్రారంభం కాకముందే 11గంటల సమయంలో మహిళలు కుర్చీల్లో నుంచి లేచి వెళ్లిపోతుండటంతో ప్రధాన గేట్ల వద్ద పోలీసులు అడ్డుకుని వారిని వెనక్కి పంపించారు. తాము వెళ్లిపోతుంటే ఎందుకు అడ్డుకుంటారంటూ కొందరు మహిళలు ప్రశ్నించారు. 12.09గంటలకు సీఎం జగన్‌ ప్రసంగం ప్రారంభించారు. అనంతరం విద్యా కానుకలను పంపిణీ చేశారు. 


అటు కిట్లు.. ఇటు కిక్కు..

సీఎం జగన్‌ కార్యక్రమానికి గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలకు కర్ణాటకకు చెందిన 90ఎంఎల్‌ టెట్రా ప్యాకెట్ల కర్ణాటక మద్యాన్ని సరఫరా చేసినట్లు తెలుస్తోం ది. సభ పరిసరాల్లో కొందరు మద్యం తాగుతూ కనిపించారు. సభావేదికకు వెళ్లే మార్గంలో తనిఖీ చేస్తున్న పోలీసులకు కొందరివద్ద మద్యం టెట్రా ప్యాకెట్లు లభించాయి.

Updated Date - 2022-07-06T08:48:19+05:30 IST