9న పాతపట్నానికి సీఎం జగన్‌ రాక

ABN , First Publish Date - 2021-11-06T00:43:12+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఈనెల 9న శ్రీకాకుళం జిల్లాకు రానున్నారు. పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె, కేంద్ర ప్రభుత్వ

9న పాతపట్నానికి సీఎం జగన్‌ రాక

శ్రీకాకుళం: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఈనెల 9న శ్రీకాకుళం జిల్లాకు రానున్నారు. పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె, కేంద్ర ప్రభుత్వ సర్వీసుల ఐఏఎస్‌ అధికారిణి వేదిత వివాహం శనివారం విశాఖ జిల్లా సింహాచలం దేవస్థానంలో జరగనుంది. ఈ నెల 9న పాతపట్నంలో రిసెప్షన్‌ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్‌ హాజరవుతారు. విశాఖపట్నం నుంచి ప్రత్యేక హెలీకాఫ్టర్‌లో మధ్యాహ్నం 12 గంటలకు పాతపట్నం చేరుకుంటారు. రిసెప్షన్‌ అనంతరం భువనేశ్వర్‌ వెళ్లనున్నారు. వంశధార నదిపై శ్రీకాకుళం జిల్లా భామిని మండలం నేరేడు గ్రామంలో బ్యారేజీ నిర్మాణంపై ఒడిశా ప్రభుత్వంతో 106 ఎకరాల భూమి విషయంలో సరిహద్దుల వివాదం ఉంది. 1962 నుంచి ఈ వివాదం కోర్టులో నడుస్తోంది. ఇటీవల బ్యారేజీ నిర్మాణానికి పచ్చజెండా ఊపుతూ ట్రిబ్యునల్‌ తీర్పు వెలువడింది. నేరేడు బ్యారేజీ నిర్మాణం పూర్తయితే జిల్లాలో 2.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సరిహద్దు వివాదాంపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌తో చర్చించేందుకు సీఎం జగన్‌ భువనేశ్వర్‌ వెళ్లనున్నారు.  

Updated Date - 2021-11-06T00:43:12+05:30 IST