గవర్నర్‌ హరిచందన్‌ను కలిసిన సీఎం జగన్‌

ABN , First Publish Date - 2021-06-14T23:39:25+05:30 IST

గవర్నర్‌ హరిచందన్‌ను సీఎం జగన్‌ కలిశారు. గవర్నర్ కోటాలో భర్తీకానున్న 4 ఎమ్మెల్సీ స్థానాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

గవర్నర్‌ హరిచందన్‌ను కలిసిన సీఎం జగన్‌

అమరావతి: గవర్నర్‌ హరిచందన్‌ను సీఎం జగన్‌ కలిశారు. గవర్నర్ కోటాలో భర్తీకానున్న 4 ఎమ్మెల్సీ స్థానాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రతిపాదిత పేర్ల జాబితాను గవర్నర్‌కు ప్రభుత్వం పంపింది. ఢిల్లీ పర్యటన వివరాలను గవర్నర్‌కు జగన్ తెలపనున్నారు. ప్రభుత్వం పంపిన నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన పేర్లపై గవర్నర్ ఇంకా ఆమోదం తెలుపని విషయం తెలిసిందే.


మరోవైపు నామినేటెడ్‌ కోటాలో గవర్నర్‌ శాసనమండలిలో నియమించే ఎమ్మెల్సీ స్థానాలు 4 ఖాళీ అయ్యాయి. వీటి భర్తీకి జగన్‌ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం 4పేర్లు.. లేళ్ల అప్పిరెడ్డి(గుంటూరు జిల్లా), తోట త్రిమూర్తులు(తూర్పుగోదావరి), మోషేన్‌ రాజు(పశ్చిమగోదావరి), రమేశ్‌ యాదవ్‌(అనంతపురం జిల్లా)తో కూడిన జాబితాను గవర్నర్‌కు పంపింది. సాధారణంగా ప్రభుత్వం నుంచివచ్చిన ఫైళ్లను ఆయన అదేరోజు ఆమోదించి పంపిస్తారు. చాలా ఫైళ్లు గంటల వ్యవధిలోనే ఆమోదంతో ప్రభుత్వానికి తిరిగి వెళ్లిపోతాయి. కానీ ఎమ్మెల్సీల నియామకం ఫైలు వెళ్లి 4రోజులైనా ఇంతవరకూ ఆమోదం పొందలేదు. ఇందులో లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులుపై క్రిమినల్‌ కేసులు న్నట్లు గవర్నర్‌కు ఫిర్యాదులు అందాయి.

Updated Date - 2021-06-14T23:39:25+05:30 IST