ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ

ABN , First Publish Date - 2021-05-11T22:58:57+05:30 IST

ఆక్సిజన్ కేటాయింపులు, సరఫరాపై సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కొవాగ్జిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని

ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ

అమరావతి : ఆక్సిజన్ కేటాయింపులు, సరఫరాపై సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కొవాగ్జిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి టెక్నాలజీ బదిలీ అంశాన్ని పరిశీలించాలని సీఎం జగన్ లేఖలో విజ్ఞప్తి చేశారు. 20 ఆక్సిజన్ ట్యాంకర్లను ఏపీకి మంజూరు చేయాలని సీఎం జగన్ లేఖలో ప్రధాని మోదీని కోరారు. కోవ్యాక్సిన్ తయారీ దేశీయ అవసరాలను పూర్తిగా తీర్చలేకపోయిందని, ఈ వ్యాక్సిన్‌ను భారీగా ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఏర్పడిందని సీఎం పేర్కొన్నారు. కోవ్యాక్సిన్ తయారీకి భారత్ బయోటెక్, ఐసీఎంఆర్, యన్‌ఐవీలు కలిసి కృషి చేశాయని అన్నారు. తయారీ దారులు ముందుకు వస్తే కోవ్యాక్సిన్ ఉత్పత్తి చేసేందుకు, వారికి టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ చేసేలా చర్యలు తీసుకోవాలని జగన్ తన లేఖలో సూచించారు. ఎవరైనా వ్యాక్సిన్ ఉత్పత్తికి ముందుకు వస్తే, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ నొక్కి చెప్పారు. 


Updated Date - 2021-05-11T22:58:57+05:30 IST