దళితబంధు అందరికా, కొందరికేనా సీఎం స్పష్టం చేయాలి

ABN , First Publish Date - 2021-08-01T06:37:14+05:30 IST

సీఎం కేసీఆర్‌ ప్రకటించిన దళితబంధు

దళితబంధు అందరికా, కొందరికేనా సీఎం స్పష్టం చేయాలి
సదస్సులో ప్రసంగిస్తున్న దయాకర్‌

టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ 

బర్కతపుర, జూలై 31(ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్‌ ప్రకటించిన దళితబంధు పథకం అందరికా లేక కొందరికే పరిమితం చేస్తారో సీఎం స్పష్టం చేయాలని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ అన్నారు. దళితబంధు పథకాన్ని స్వాగతిస్తున్నామని అయితే దీనిని ఎన్నికల స్టంట్‌గా ఉపయోగించుకోవద్దని ఆయన అన్నారు. శనివారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ది యునైటెడ్‌ ఫోరం ఫర్‌ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్‌ ఆధ్వర్యంలో దళిత బంధు పథకంపై సదస్సు నిర్వహించారు. అద్దంకి దయాకర్‌ మాట్లాడుతూ,  దళిత బంఽధు పథకాన్ని రైతు బంధు పథకంలా పేదలందరికీ వర్తింపచేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. మాజీమంత్రి పుష్పలీల మాట్లాడుతూ దళితబంధు పథకాన్ని కేవలం కంటితుడుపుగా కాకుండా పటిష్టంగా అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎన్నారై డాక్టర్‌ వినోద్‌కుమార్‌, 2018 మిస్‌ ఇండియా లక్ష్మి, సామాజిక కార్యకర్త రేఖ, నర్సింగ్‌రావు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-01T06:37:14+05:30 IST