అందుకే కేసీఆర్ అపెక్స్ భేటీని వాయిదా వేయాలన్నారు: భట్టి విక్రమార్క

ABN , First Publish Date - 2020-08-04T20:54:06+05:30 IST

అందుకే కేసీఆర్ అపెక్స్ భేటీని వాయిదా వేయాలన్నారు: భట్టి విక్రమార్క

అందుకే కేసీఆర్ అపెక్స్ భేటీని వాయిదా వేయాలన్నారు: భట్టి విక్రమార్క

హైదరాబాద్: ఆత్మగౌరవం కోసం పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణలో దళితులపై దాడులు ఆగడం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. దళిత వర్గానికి రాజ్యాంగ రక్షణ కరువు అయింది! అని విమర్శించారు. దళితులపై జరుగుతున్న దాడులపై డీజీపీకి ఫిర్యాదు చేస్తే కనీసం స్పందన లేదని మండిపడ్డారు. దళితులపై జరుగుతున్న దాడులు గురించి గవర్నర్ కి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. గజ్వేల్ లో  ప్రభుత్వం చేసిన తప్పు వల్లే రైతు ఆత్మహత్య చేసుకున్నాడని, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తుందని విక్రమార్క ఆరోపించారు. పట్టణాల నుంచి గ్రామాలకు కరోనా వైరస్ వ్యాప్తి జరిగిందని, ప్రజారోగ్యాన్ని ఇంతదారుణంగా గాలికివదిలేసిన ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడూ చూడలేదని విమర్శించారు.


గ్రామాల్లో- మండల కేంద్రాల్లో క్వరంటైన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఏపీ ప్రతిరోజు 11 టీఎంసీలు శ్రీశైలం బ్యాక్ వాటర్ లిఫ్ట్ చేయడానికి జీవో విడుదల చేస్తే కేసీఆర్ స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5వ తేదీన అపెక్స్ భేటీకి పిలుస్తే సీఎం పట్టించుకోకుండా 20వ తేదీ తరువాత పెట్టమనడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు.


20వ తేదీ లోపు పోతిరెడ్డిపాడు టెండర్ల ప్రక్రియ పూర్తి అవుతుందని, అందుకే కేసీఆర్ అపెక్స్ భేటీని వాయిదా వేయాలన్నారని భట్టి విక్రమార్క విమర్శించారు. తెలంగాణకు ద్రోహం చేసే సీఎంను ఇప్పటిదాకా చూడలేదని, తెలంగాణ ద్రోహి కేసీఆర్, 19వ తేదీలోపు ఏపీ చేసే టెండర్ ప్రక్రియను కేసీఆర్ ప్రభుత్వం అడ్డుకోవాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.

Updated Date - 2020-08-04T20:54:06+05:30 IST