Abn logo
Oct 1 2021 @ 11:38AM

TS Assembly: ప్రతిపక్షాలు మాట్లాడిన తీరుపై మండిపడ్డ కేసీఆర్

హైద‌రా‌బాద్: గులాబ్‌ తుఫాను దృష్ట్యా మూడు రోజులపాటు వాయిదా పడిన తెలంగాణ అసెంబ్లీ  శుక్రవారం పునఃప్రారంభం అయింది. అసెంబ్లీ వర్షా‌కాల సమా‌వే‌శాలు కొనసాగుతున్నాయి. గ్రామ పంచాయ‌తీ నిధులపై శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా ప్ర‌తిప‌క్షాలు మాట్లాడిన తీరుపై సీఎం కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ సభ్యుల మాటలు వింటే జాలేస్తోందని కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సర్పంచులే గౌరవంగా బతుకుతున్నారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌ హయాంలో వ్యక్తిపై సగటున రూ.4 మాత్రమే ఖర్చు చేశారని, తమ హయాంలో రూ.650 విడుదల చేస్తున్నమన్నారు. కాంగ్రెస్‌ హయాంలో సర్పంచ్‌లు ఎన్నో బాధలు, కష్టాలు పడ్డారని, ఇప్పుడు సర్పంచ్‌లు ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పారు. కరోనా టైంలో ఎమ్మెల్యేల జీతాలు ఆపాం కానీ.. పంచాయతీలకు నిధులు ఎక్కడా ఆపలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధి చూసి అనేక రాష్ట్రాలు ఆశ్చర్యపోతున్నాయన్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...