Advertisement
Advertisement
Abn logo
Advertisement

రాయలసీమకు వెళ్లి చెప్పడం కాదు.. జగన్‌ను ఇక్కడికి పిలిచి క్లియర్‌గా చెప్పా: కేసీఆర్

హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత సీఎం కేసీఆర్ రెండో సారి మీడియా ముందుకు వచ్చారు. ఆదివారం ప్రెస్‌మీట్ నిర్వహించిన కేసీఆర్.. మళ్లీ సోమవారం కూడా ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. బీజేపీ నేతల ఆరోపణలను తిప్పికొట్టారు. బీజీపీలా టీఆర్ఎస్ నీచంగా ప్రవర్తించబోదని కేసీఆర్ చెప్పారు. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు బాగుండాలని తాము కోరుకుంటామని తెలిపారు. ‘‘నేను రాయలసీమకు వెళ్లినప్పుడు ఆ ప్రాంతానికి నీళ్లు రావాలని చెప్పిన మాట వాస్తవమే. ఈ రోజు కూడా ఆ మాట చెప్తున్నా. రాయలసీమకు నీళ్లు ఇవ్వొద్దని ఎవరు చెప్తున్నారు? నేను అక్కడికి వెళ్లి చెప్పడం కాదు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని, వాళ్ల అధికారులను ఇక్కడికి పిలిపించి ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా చాలా స్పష్టంగా చెప్పాను. ‘కృష్ణా నదిలో నీళ్లు లేవు. గోదావరిలో ఉన్నాయి. మేము గోదావరి నుంచి తెచ్చుకుంటున్నాము. మీరు కూడా అక్కడి నుంచి తెచ్చుకోండి.. మీకు మేము సహకరిస్తాం’ అని చెప్పా. రాయలసీమ కరువు ప్రాంతం. వాళ్లకు తప్పకుండా నీళ్లు రావాలి. అది న్యాయం. ఈ నీటి విభేదాలు అంతా కేంద్రం ఆడే డ్రామా. కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా కృష్ణా, గోదావరి, కావేరి నదుల అనుసంధానం అంటూ ఎన్నికల కోసం డ్రామాలు ఆడడం పరిపాటి అయిపోయింది.’’ అని కేసీఆర్ అన్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement