ఢిల్లీ పర్యటనలో సీఎం KCR

ABN , First Publish Date - 2021-11-22T14:05:57+05:30 IST

తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపనున్నారు. రెండు, మూడు రోజుల పాటు సీఎం ఢిల్లీలోనే ఉండనున్నారు.

ఢిల్లీ పర్యటనలో సీఎం KCR

న్యూఢిల్లీ: తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపనున్నారు. రెండు, మూడు రోజుల పాటు సీఎం ఢిల్లీలోనే ఉండనున్నారు. ధాన్యం కొనుగోలు, కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు, విద్యుత్ కేటాయింపులు, రాష్ట్ర విభజన అంశాలపై ఈ పర్యటనలోకేంద్రంతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. పర్యటలో భాగంగా ప్రధాని మోదీ, జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్, విద్యుత్ శాఖ మంత్రి ఆర్.కె సింగ్‌లతో కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం ఉంది. తెలంగాణ నుంచి ఎంత ధాన్యం సేకరిస్తారో స్పష్టంగా చెప్పాలని కోరనున్నారు. కాలపరిమితితో కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని, రాష్ట్రం చేపట్టిన పలు ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చే విషయాన్ని షేకావత్‌తో చర్చించే అవకాశం ఉంది. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి చెందిన పెండింగ్ అంశాలను కూడా సీఎం ప్రస్తావించనున్నారు. సీఎం కేసీఆర్‌ వెంట రాష్ట్ర మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, సీఎస్, సీనియర్ అధికారులు ఉన్నారు.


Updated Date - 2021-11-22T14:05:57+05:30 IST