సీఎం కేసీఆర్‌ నియంతపాలన తగదు

ABN , First Publish Date - 2020-12-03T05:13:56+05:30 IST

సీఎం కేసీఆర్‌ నియంతపాలన తగదని మాజీ మంత్రి షబ్బీర్‌అలీ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ ధర్నా చౌక్‌లో బీబీపేట మండలంలోని జనగామ గ్రామ సర్పంచ్‌ రాజును సస్పెన్షన్‌ చేయడంపై నిరసన తెలిపారు.

సీఎం కేసీఆర్‌ నియంతపాలన తగదు
మాట్లాడుతున్న మాజీమంత్రి షబ్బీర్‌అలీ

సర్పంచ్‌ రాజుపై సస్పెన్షన్‌ ఎత్తివేయకుంటే కలెక్టరేట్‌ను ముట్టడిస్తాం: మాజీ మంత్రి షబ్బీర్‌అలీ 

న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు

కామారెడ్డి, డిసెంబరు 2: సీఎం కేసీఆర్‌ నియంతపాలన తగదని మాజీ మంత్రి షబ్బీర్‌అలీ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ ధర్నా చౌక్‌లో బీబీపేట మండలంలోని జనగామ గ్రామ సర్పంచ్‌ రాజును సస్పెన్షన్‌ చేయడంపై నిరసన తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందినవాడు కాబట్టే సస్పెన్షన్‌ చేశారని, ఎత్తివేయకుంటే కలెక్టరేట్‌ ముట్టడిస్తామని ఆయన అన్నారు. నూతన పంచాయతీ రాజ్‌ చట్టాన్ని తీసుకొచ్చి సర్పంచ్‌లను రబ్బర్‌ స్టాంప్‌ల్లాగా మార్చార ని ఆరోపించారు. జనగామ సర్పంచ్‌ రాజు కాంగ్రెస్‌ పార్టీ మారనం దుకు సస్పెన్షన్‌ను కలెక్టర్‌ ద్వారా వేయించారని ఆరోపించారు. విచా రణ చేయకుండా కలెక్టర్‌ సర్పంచ్‌లను సస్పెండ్‌ చేస్తారా? అని ప్ర శ్నించారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు కలెక్టర్‌పై ఫిర్యాదు చేస్తా మన్నారు. నిర్మించిన వాటికి బిల్లులు చెల్లించకుండా జాప్యం చేయ డంతో సర్పంచ్‌లు అప్పుల పాలవుతున్నారన్నారు. రాజుకు న్యాయం జరిగే వరకూ కాంగ్రెస్‌ అండగా ఉంటుందని కాంగ్రెస్‌ నాయకుడు అద్దంకి దయాకర్‌ అన్నారు. సర్పంచ్‌ రాజు సస్పెన్షన్‌ విషయంలో హైకొర్టులో ఫీల్‌ దాఖలు చేస్తామన్నారు. కాంగ్రెస్‌  హయంలో ఎప్పుడు ఇలా వ్యవహరించలేదని గు ర్తు చేశారు. కాంగ్రెస్‌ నాయకులపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని ఆయన టీఆర్‌ఎస్‌ నాయ కులకు హితవుపలికారు. అనంతరం జనగామ స ర్పంచ్‌, కొందరు వార్డు సభ్యులు కలెక్టరేట్‌కు వెళ్లి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ ధర్నా కార్యక్రమం లో జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌ రా వు, టీపీసీసీ డెలిగేట్‌ సుభాష్‌రెడ్డి, మాజీ డీసీ సీబీ చైర్మన్‌ ఎడ్లరాజీ రెడ్డి, మాజీ సీడీసీ చైర్మన్‌ బద్దం ఇంద్రకరణ్‌రెడ్డి, కామారెడ్డి పట్టణ అధ్యక్షుడు పండ్ల రాజు, కాంగ్రెస్‌ కౌన్సిలర్లు అన్వర్‌హైమద్‌, శివకృష్ణ మూర్తి, నాయకులు మోహన్‌,రవిప్రసాద్‌, జిల్లా కాంగ్రెస్‌ ఎస్టీ సెల్‌ అధ్యక్షుడు గణేష్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-03T05:13:56+05:30 IST