పరిహారం చెల్లింపులో సీఎం కేసీఆర్‌ విఫలం

ABN , First Publish Date - 2021-10-18T05:49:30+05:30 IST

చర్లగూడెం రిజర్వాయర్‌ ముంపు బాధిత కుటుంబాలకు పునరావాసం, పరిహారం అందించడంలో సీఎం కేసీఆర్‌ మాట తప్పారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు.

పరిహారం చెల్లింపులో సీఎం కేసీఆర్‌ విఫలం
మర్రిగూడ : నామాపురంలో బాధిత కుటుంబానికి నగదు సాయం అందిస్తున్న ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి

 ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి  
మర్రిగూడ, అక్టోబరు 17 :
చర్లగూడెం రిజర్వాయర్‌ ముంపు బాధిత కుటుంబాలకు పునరావాసం, పరిహారం అందించడంలో సీఎం కేసీఆర్‌ మాట తప్పారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మండలంలోని తమడపల్లిలో విలేకరులతో మాట్లాడుతూ డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా చర్లగూడెంలో ముంపునకు గురవుతున్న బాధిత నిర్వాసితులకు 2014 భూసేకరణ చట్టం ప్రకారం పునరావాసం కింద రూ.12లక్షలు ప్రతీ కుటుంబానికి డబుల్‌ బెడ్‌రూం ఇల్లు కేటాయిస్తామని హామీనిచ్చి మాట తప్పారన్నారు. ప్రస్తుతం ప్రతీ కుటు ంబానికి రూ.7.50లక్షలు, పునరావాసం కింద కేవలం ఒక ప్లాట్‌ మాత్రమే ఇస్తానని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నా రు. ఇప్పటికైనా బాధిత నిర్వాసితులకు పునరావాసం కల్పి చి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో  పార్టీ మండల అధ్యక్షుడు రామదాసు శ్రీనివాస్‌, మాజీ ఎంపీపీ అనంతరాజుగౌడ్‌, మాజీ జడ్పీటీసీ మేతరి యాదయ్య, సర్పంచలు కొట్టం మాధవి, శ్రీశైలం, సంపత, రవి, శాంతమ్మ పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలకు అండగా ఉంటా
మర్రిగూడ / నార్కట్‌పల్లి : బాధిత కుటుంబాలకు పెద్దన్నగా ఉంటూ ఆదుకుంటానని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మర్రిగూడ మండలంలోని నామాపురం, తమడపల్లి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన బొడ్డు అం జయ్య, ఉడుతల వెంకటయ్య కుటుంబాలను పరామర్శించారు. మృతుల కుటుంబసభ్యులైన అంజమ్మ, అలివేలుకు చెరో లక్ష రూపాయల సాయం అందించారు. అదేవిధంగా ఇటీవల అనారోగ్యానికి గురై కోలుకుంటున్న కాంగ్రెస్‌ నార్కట్‌పల్లి మండల అధ్యక్షుడు బత్తుల ఊశయ్యగౌడ్‌ను పరామర్శించారు. అనారోగ్యానికి కారణాలు, ఆస్పత్రి చికిత్సా వివరాలను తెలుసుకుని మెడికల్‌ రిపోర్టులను పరిశీలించారు.



Updated Date - 2021-10-18T05:49:30+05:30 IST