Advertisement
Advertisement
Abn logo
Advertisement

నాది ఫార్మర్‌ హౌస్‌: కేసీఆర్‌

హైదరాబాద్: తనది ఫామ్‌‌హౌస్‌ కాదని.. ఫార్మర్‌ హౌస్ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేసారు. తనపై, తనకు ఉన్న ఫార్మర్‌ హౌస్‌పై బీజేపీ రాష్ట్ర  అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తన ఫామ్‌ హౌస్‌కి వచ్చి దున్నుతావా అని సంజయ్‌కు సవాల్ విసిరారు. నా ఫామ్‌‌హౌస్‌లో అడుగు పెడితే ఆరు ముక్కలు చేస్తా అని ఆయన హెచ్చరించారు. తన ఫామ్‌‌హౌస్‌ కాడ గొర్రెలు, బర్రెలు ఉంటాయన్నారు. టీఆర్‌ఎస్‌కి, కేసీఆర్‌కు ఎవరూ బాస్‌లు లేరన్నారు. ప్రజలే తమ బాస్‌లు  అని కేసీఆర్‌ స్పష్టం చేసారు. ఎన్నికలల్లో గెలిపిస్తే సేవలందిస్తం.. లేకపోతే విపక్షంలో కూర్చుంటామని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఇది సహజమన్నారు. గెలిచామన్న గర్వం, అహంభావం ఉండకూడదని కేసీఆర్‌ హితవు పలికారు. 


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement