కొత్తపల్లి ఘటనపై సీఎం KCR తీవ్ర దిగ్భ్రాంతి

ABN , First Publish Date - 2021-10-10T17:08:18+05:30 IST

జోగుళాంబ గద్వాల జిల్లా కొత్తపల్లిలో వర్షాలనికి గుడిసె కూలి ఐదుగురు మృత్యువాత పడిన ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

కొత్తపల్లి ఘటనపై సీఎం KCR తీవ్ర దిగ్భ్రాంతి

హైదరాబాద్: జోగుళాంబ గద్వాల జిల్లా కొత్తపల్లిలో వర్షాలనికి గుడిసె కూలి ఐదుగురు మృత్యువాత పడిన ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి నిరంజన్ రెడ్డికి ఫోన్ చేసి దుర్ఘటనపై సీఎం ఆరా తీశారు. మృతులు ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని ఆదేశాలు జారీ చేశారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని... వారి కుటుంబంలో మిగతా వారికి ప్రభుత్వపరంగా విద్య, వైద్య సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. గ్రామాలలో శిథిలావస్థలో ఉన్న ఇండ్లను, నిర్మాణాలను అధికారులు గుర్తించాలన్నారు. ప్రజలను సురక్షిత స్థావరాలకు అధికారులు తరలించాలని ఆదేశించారు. మరోవైపు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కొత్తపల్లి దుర్ఘటనలో మరణించిన కుటుంబాలకు  రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. 

Updated Date - 2021-10-10T17:08:18+05:30 IST