Abn logo
Oct 15 2021 @ 01:40AM

ప్రజల గుండెల్లో సీఎం కేసీఆర్‌

సత్తక్కపల్లి సమావేశంలో మాట్లాడుతున్న జెడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత

- జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత

మెట్‌పల్లి రూరల్‌, అక్టోబరు, 14 : దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ప్రజల కోసం ప్రవేశపట్టిన సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టి అమలు చేసి ప్రజల గుండెల్లో నిలిచారని జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత అన్నారు. గురువారం మండలంలోని సత్తక్కపల్లి గ్రామం లో నిర్మించిన ఎనిమిది డబుల్‌ బెడ్‌రూంలను కోరుట్ల ఎమ్మెల్యే విద్యా సాగర్‌రావుతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ ఇండ్లు లేని నిరుపేద కోసం డబుల్‌ బెడ్‌రూంలను కట్టి ఇస్తూ అండగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిలుస్తున్నారన్నారు. రైతుల సంక్షేమం కోసం అనే పథకాలను ప్రవేశపెడుతూ నిరంతరం విద్యుత్‌ను అంద జేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మారు సాయిరెడ్డి, జడ్పీ టీసీ కాటిపెల్లి రాధ- శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్‌ లక్ష్మిరాజగౌడ్‌, ఎంపీటీసీ గం గాధర్‌, ఉపసర్పంచ్‌ లింగారెడ్డి, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.