Advertisement
Advertisement
Abn logo
Advertisement

CM KCR నాగార్జున సాగర్ పర్యటన షెడ్యూల్ ఇదే..

నల్గొండ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సోమవారం నాడు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించి అధికారికంగా షెడ్యూల్ కూడా ఖరారైనట్లు సీఎంవో నుంచి ఓ ప్రకటన విడుదలైంది. రేపు ఉదయం10 గంటలకు ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గం మీదుగా బేగంపేట విమాన శ్రయానికి సీఎం వెళ్లనున్నారు. అక్కడ్నుంచి హెలికాఫ్టర్ ద్వారా 10.40కు హాలియా చేరుకోనున్నారు. ఉదయం 10.55 నిమిషాలకు మార్కెట్ యార్డ్‌కు చేరుకుని హాలియాలో నియోజకవర్గ అభివృద్ధిపై ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1.10 గంటలకు స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్ నివాసంలో కేసీఆర్ భోజనం చేయనున్నారు. 


పర్యటన అనంతరం 2.10 నిమిషాలకు హెలికాఫ్టర్ ద్వారా హైదరాబాద్‌కు సీఎం తిరుగు ప్రయాణం చేయనున్నారు. ఇప్పటికే నియోజకవర్గ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేతలు ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు. కాగా.. సీఎం కేసీఆర్ పర్యటనతో సాగర్ నియోజకవర్గ ప్రజలంతా ఇప్పటి వరకూ ఉన్న సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుందని భావిస్తున్నారు. అంతేకాదు.. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ ఇచ్చిన హామీలతో పాటు సోమవారం పర్యటనలో మరిన్ని వరాల జల్లు కురిపించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

Advertisement
Advertisement