ఈనెల 28న ‘స్టేట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ కాన్ఫరెన్స్’

ABN , First Publish Date - 2022-01-26T22:03:17+05:30 IST

రాష్ట్రంలో మాదక ద్రవ్యాల (డ్రగ్స్) వాడకం అనే మాట వినపడకుండా అత్యంత కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు.

ఈనెల 28న ‘స్టేట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ కాన్ఫరెన్స్’

హైదరాబాద్: రాష్ట్రంలో మాదక ద్రవ్యాల (డ్రగ్స్) వాడకం అనే మాట వినపడకుండా అత్యంత కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా డ్రగ్స్ వాడకాన్ని నియంత్రించేందుకు కఠిన చర్యలు చేపట్టే దిశగా ఈ నెల 28వ తేదీన ప్రగతి భవన్ లో ‘స్టేట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ కాన్ఫరెన్స్’ నిర్వహించాలని నిర్ణయించారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరుగనున్న ఈ సదస్సులో రాష్ట్ర హోం మంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి , సీఎస్, డీజీపీ, డీజీలు, అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు, డీసీపీ అధికారులుతో పాటు రాష్ట్ర ఎక్సైజ్ పోలీస్ శాఖకు చెందిన ఎస్పీలు సంబంధిత ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. 


రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వాడకాన్ని కఠినంగా నియంత్రించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ , విధి విధానాలను ఈ సదస్సులో చర్చించనున్నారు. ఈ మేరకు పోలీసుశాఖ, ఎక్సైజ్ శాఖ, అధికార యంత్రాంగాన్ని మరింత అప్పమత్తం చేయనున్నారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగాన్ని నియంత్రించే దిశగా చేపట్టాల్సిన కఠిన చర్యలపై బుధవారం ప్రగతి భవన్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీపీపీమహేందర్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తో ముఖ్యమంత్రి కేసీఆర్ రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎంవో ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగంలో దోషులుగా తేలిన వారు ఎంతటి వారైనా సరే కఠినంగా వ్యవహరించాలని అన్నారు. కఠిన చర్యల అమలుకై ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఇందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1000 మందితో కూడిన ప్రత్యేకంగా ‘‘ నార్కొటిక్ అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కంట్రోల్ సెల్ ’ (కౌంటర్ ఇంటిలిజెన్స్ సెల్) పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ ప్రత్యేక విభాగం రాష్ర్ర్ట డీజీపీ ఆధ్వర్యంలో, డ్రగ్స్ ను వ్యవస్థీక`త నేరాలను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవడం కోసం ప్రత్యేక నవిధులను నిర్వర్తించనుంది. 

Updated Date - 2022-01-26T22:03:17+05:30 IST