పట్టణ ప్రగతిపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

ABN , First Publish Date - 2021-06-26T23:50:12+05:30 IST

పట్టణ ప్రగతిపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. పట్టణాల

పట్టణ ప్రగతిపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌: పట్టణ ప్రగతిపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. పట్టణాల వారీగా క్లీనింగ్ ప్రొఫైల్ రూపొందించాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో రిటైర్డు ఉద్యోగులు, మాజీ సైనికుల సేవలను వినియోగించుకోవాలని అధికారులకు సీఎం కేసీఆర్‌ సూచించారు. జూలై చివరికల్లా ప్రభుత్వ శాఖల నడుమ పేరుకుపోయిన పరస్పర బకాయిలను 'బుక్ అడ్జస్ట్‌మెంట్' ద్వారా పరిష్కరించాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ప్రతీ పట్టణంలో కనీసం నాలుగైదు డంపు యార్డుల కోసం స్థలాలను సేకరించి పెట్టుకోవాలని అధికారులకు సీఎం కేసీఆర్‌ సూచించారు. 

Updated Date - 2021-06-26T23:50:12+05:30 IST