Advertisement
Advertisement
Abn logo
Advertisement

జల జగడం : ఏపీపై CM KCR సీరియస్ కామెంట్స్..

నల్గొండ : తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల జగడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సీరియస్ కామెంట్స్ చేశారు. సోమవారం నాడు నాగార్జున సాగర్‌లో పర్యటించిన ఆయన.. హాలియాలో నిర్వహించిన సభలో నీటి వివాదాన్ని ప్రస్తావించారు. కృష్ణా జలాలపై ఏపీ ప్రభుత్వం దాదాగిరి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కృష్ణా జలాల వివాదంపై చర్యలు చేపడుతామని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు.


దేవరకొండలో ఐదు లిఫ్టులు, మిర్యాలగూడలో ఐదు లిఫ్టులు, నకిరేకల్‌, హుజూర్‌నగర్‌లో ఒక్కొక్క లిఫ్ట్‌ ఇలా నల్గొండ జిల్లాలో మొత్తం 15 ఎత్తిపోతల పథకాలు మంజూరు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. వీటన్నింటిని ఏడాదిన్నరలోపే పూర్తి చేసి తీరుతామని సభాముఖంగా ఆయన హామీ ఇచ్చారు. జల వివాదంపై కేంద్ర ప్రభుత్వం సమస్యను పరిష్కరించాల్సింది పోయి తెలంగాణ వ్యతిరేక వైఖరిని అవలంభిస్తోందని కేసీఆర్ ఆగ్రహించారు. కేసీఆర్ మాట్లాడుతున్నంత సేపు సభకు వచ్చిన ప్రజలు, టీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు జై కేసీఆర్.. జై టీఆర్ఎస్.. జై తెలంగాణ అంటూ ఈలలు, కేకలతో హోరెత్తించారు.

హామీల వర్షం..

కాగా.. సాగర్‌ నియోజకవర్గ అభివృద్ధికి రూ.150 కోట్లు కేటాయిస్తున్నామని ప్రకటించారు. ఏడాదిన్నర లోపు అన్ని లిఫ్టులను పూర్తి చేస్తాం. బంజారాల కోసం బంజారా భవనం నిర్మాస్తాం. దళితబంధు కోసం లక్ష కోట్లయినా ఖర్చు చేస్తాం. 24 గంటల విద్యుత్‌ ఇస్తామంటే గతంలో జానారెడ్డి ఎగతాళి చేశారు. రెండేళ్లు కాదు ఇరవై ఏళ్లయినా ఇవ్వలేరని జానారెడ్డి అన్నారు. 24 గంటల విద్యుత్‌ ఇస్తే టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకుంటానని జానారెడ్డి అన్నారు. రెండేళ్లలో మేం 24 గంటల విద్యుత్‌ ఇస్తున్నాం. జానారెడ్డి మాత్రం మొన్న కాంగ్రెస్‌ కండువా కప్పుకునే పోటీ చేశారు అని కేసీఆర్‌ విమర్శల వర్షం కురిపించారు.

Advertisement
Advertisement