పోరాటయోధుడు కుమ్రం భీమ్‌

ABN , First Publish Date - 2021-10-23T08:05:56+05:30 IST

అడవి బిడ్డల హక్కుల పోరాట యోధుడు కుమ్రం భీమ్‌ ఆశయసాధనకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం కేసీఆర్‌ అన్నారు. మాగూడెం, మాతండాలో, మారాజ్యం అనే ఆదివాసీల తరతరాల ఆకాంక్షను తెలంగాణ ..

పోరాటయోధుడు కుమ్రం భీమ్‌

  • సీఎం కేసీఆర్‌ ఘన నివాళి

 

హైదరాబాద్‌,  అక్టోబరు22 (ఆంధ్రజ్యోతి): అడవి బిడ్డల హక్కుల పోరాట యోధుడు కుమ్రం భీమ్‌  ఆశయసాధనకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం కేసీఆర్‌ అన్నారు. మాగూడెం, మాతండాలో, మారాజ్యం అనే ఆదివాసీల తరతరాల ఆకాంక్షను తెలంగాణ ప్రభుత్వం నిజం చేసిందని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివాసీల ఆరాధ్యదైవం కుమ్రం భీమ్‌ సేవలను స్మరించుకుంటూ  ఘననివాళి తెలిపారు. ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమం  కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. కుమ్రం భీమ్‌ జయంతిని రాష్ట్రప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. హైదరాబాద్‌ నడిబొడ్డున ఆదివాసీల ఆత్మగౌరవాన్ని నిలిపేలా ఆదివాసీ భవన్‌నిర్మాణం చేపట్టామన్నారు. అది ప్రారంభోత్సవానికి సిద్ధమైనట్లు పేర్కొన్నారు. జల్‌ జంగల్‌జమీన్‌ అనే కుమ్రం భీమ్‌ నినాదంలోని స్ఫూర్తి, తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమంలోనూ ఇమిడి ఉన్నదని తెలిపారు.

Updated Date - 2021-10-23T08:05:56+05:30 IST