పంజాబ్‌ తరహాలో తెలంగాణలో ధాన్యం సేకరించాలి: కేసీఆర్‌

ABN , First Publish Date - 2021-11-18T00:45:44+05:30 IST

పంజాబ్‌ తరహాలో తెలంగాణలో ధాన్యాన్ని సేకరించాలని కేంద్రాన్ని

పంజాబ్‌ తరహాలో తెలంగాణలో ధాన్యం సేకరించాలి: కేసీఆర్‌

హైదరాబాద్: పంజాబ్‌ తరహాలో తెలంగాణలో ధాన్యాన్ని సేకరించాలని కేంద్రాన్ని సీఎం కేసీఆర్‌ డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. రబీ ధాన్యాన్ని కొనేలా ఎఫ్‌సీఐకి ఆదేశాలు ఇవ్వాలన్నారు. తెలంగాణ నుంచి ఎంత మొత్తంలో కొనుగోలు చేస్తారో స్పష్టం చేయాలని కేసీఆర్ కోరారు. ఖరీఫ్‌లో 55.75 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం దిగుబడి వచ్చిందన్నారు. కేవలం 32.66 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం సేకరించారన్నారు. ఖరీఫ్‌లో 40 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లేఖలో కేసీఆర్‌ డిమాండ్ చేశారు. వచ్చే రబీలో ఎంత ధాన్యం సేకరిస్తారో ముందే ప్రకటించాలన్నారు. 



Updated Date - 2021-11-18T00:45:44+05:30 IST