తెలంగాణలో వరదల ఉధృతిపై సీఎం కేసీఆర్‌ రివ్యూ

ABN , First Publish Date - 2021-07-21T05:30:00+05:30 IST

భారీ వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు.

తెలంగాణలో వరదల ఉధృతిపై సీఎం కేసీఆర్‌ రివ్యూ

హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా ఎస్సారెస్పీ ఎగువ నుంచి గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. యుద్ధ ప్రాతిపదికన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను పంపాలని సీఎస్‌కు సూచించారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉండడంతో... ప్రజాప్రతినిధులంతా నియోజకవర్గాల్లోనే ఉండాలని సీఎం ఆదేశించారు. నిజామాబాద్‌ జిల్లాలో భారీవర్షాలు కురుస్తుండడంతో... తక్షణమే పర్యవేక్షించాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి సూచించారు. ప్రజలకు ఆటంకాలు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలందరూ ఇళ్లల్లోంచి బయటకు రావద్దని సిఎం కేసీఆర్ సూచించారు.

Updated Date - 2021-07-21T05:30:00+05:30 IST