మధ్యం సీసాల గురించి సీఎంకు డిప్యూటీ సీఎం చెప్పారట!

ABN , First Publish Date - 2021-11-30T22:03:05+05:30 IST

నేను ఆయనను (డిప్యూటీ) అడుగుతున్నాను. మందు సీసాలు ఈ ప్రాంగణంలోకి వస్తే అంతకంటే ఘోరం ఇంకొకటి ఉండదు. దీన్ని ఎంతమాత్రం సహించాల్సిన అవసరం లేదు. స్పీకర్‌ అనుమతి ఇస్తే సభలోని సభ్యులందరినీ విచారణకు ఆదేశాలు ఇస్తాను...

మధ్యం సీసాల గురించి సీఎంకు డిప్యూటీ సీఎం చెప్పారట!

పాట్నా: బిహార్‌లో మధ్య నిషేధం ఉన్నప్పటికీ యదేచ్ఛగా మధ్యం పంపిణీ అవుతోందనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. జాతీయ సంస్థలు చేసిన దర్యాప్తులో కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఏకంగా బిహార్ అసెంబ్లీ ప్రాంగణంలోకే మందు సీసాలు వచ్చాయట. ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎంను అడిగితే ఈ విషయం తెలిసిందని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అసెంబ్లీ సాక్షిగా చెప్పుకొచ్చారు. ఇది చాలా దారుణ పరిణామంగా భావిస్తున్నామన్న నితీష్.. మందు సీసాలు సరఫరా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.


మంగళవారం అసెంబ్లీలో నితీష్ మాట్లాడుతూ ‘‘నేను ఆయనను (డిప్యూటీ) అడుగుతున్నాను. మందు సీసాలు ఈ ప్రాంగణంలోకి వస్తే అంతకంటే ఘోరం ఇంకొకటి ఉండదు. దీన్ని ఎంతమాత్రం సహించాల్సిన అవసరం లేదు. స్పీకర్‌ అనుమతి ఇస్తే సభలోని సభ్యులందరినీ విచారణకు ఆదేశాలు ఇస్తాను. ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు ఈ విషయమై ఎంక్వైరీ చేయమని చెప్తాను. ఎవరైతే వాటిని తీసుకు వచ్చారో వారిని కఠినంగా శిక్షించాల్సిందే’’ అని నితీష్ అన్నారు. నితీష్ ప్రసంగం అనంతరం స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా మాట్లాడుతూ ఈ విషయమై చర్యలు తీసుకునేందుకు సభానేత నితీష్‌కు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు.

Updated Date - 2021-11-30T22:03:05+05:30 IST