Advertisement
Advertisement
Abn logo
Advertisement

బద్వేల్ ఉపఎన్నికలో అధికారపార్టీ అక్రమాలు: సీఎం రమేష్

కడప జిల్లా: బద్వేల్ ఉపఎన్నికలో అధికారపార్టీ అక్రమాలకు పాల్పడుతోందని ఏపీ బీజేపీ నేతలు ఆరోపించారు. తిరుపతి తరహాలోనే బద్వేల్‌లోనూ దొంగ ఓట్లు వేసేందుకు కుట్ర చేస్తున్నారని ఎంపీ సీఎం రమేష్ ఆరోపించారు. ఏడు జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు బద్వేల్‌లో తిష్ట వేశారని, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు.


బీజేపీకి డిపాజిట్ రాదన్నారని, మరి రాయలసీమ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఇంకా బద్వేల్‌లోనే ఎందుకు ఉన్నారని సీఎం రమేష్ ప్రశ్నించారు. గురువారం సాయంత్రం 7 గంటలకు ప్రచారం ముగిసినా శుక్రవారం ఉదయం కూడా వారు అక్కడే ఉన్నారని ఆరోపించారు. ఆధారాలతో సహా డీజీపీ, ఎస్పీకి లేఖలు రాశామన్నారు. అయినా పోలీసులు స్పందించలేదని, దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. వైసీపీ పథకాలు, అడ్మినిస్ట్రేషన్, పరిపాలనపై వారికే నమ్మకంలేదని, అందుకే దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని సీఎం రమేష్ అన్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement