Abn logo
Sep 17 2021 @ 00:42AM

సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం

- టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భానుప్రసాద్‌రావు

 - టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భానుప్రసాద్‌రావు

జగిత్యాల టౌన్‌, సెప్టెంబరు 16 : సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం లాంటిదని టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌ రావు అన్నారు. సారంగాపూర్‌ మండలం రేచపల్లి గ్రామానికి చెందిన బింగి గంగవ్వ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ శస్త్ర చికిత్స కోసం గురువారం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ను కలిసి తన బాధను వెల్లబోసుకుంది. దీంతో ఎమ్యెల్యే స్పదించి సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకవెళ్లగా రూ. 3 లక్షల ఎల్‌వోసీ మంజూరు చేశారు. పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు, ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌, జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంధ్రశేఖర్‌గౌడ్‌ చేతుల మీదుగా గంగవ్వ తండ్రి నర్సయ్యకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రాజేందర్‌ రెడ్డి, జడ్పీటీసీ మనోహర్‌ రెడ్డి తదితరులు ఉన్నారు. అనంతరం జగిత్యాల పట్టణ, జగిత్యాల రూరల్‌, సారంగాపూర్‌ మండలాలకు చెందిన 27 మందికి మంజూరైన రూ.8.21 లక్షల విలువగల సీఎం సహాయనిధి చెక్కులను బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంతలు అందజేశారు.  

 అభివృద్ధికి మారుపేరు టీఆర్‌ఎస్‌

 అభివృద్ధికి మారుపేరు టీఆర్‌ఎస్‌ అని టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో జగిత్యాల నియోజకవర్గ వార్డు, గ్రామ కమిటీల పరిశీలన, పట్టణ, మండల కమిటీల ఎన్నికల దిశానిర్ధేశ కార్యాక్రమాన్ని ఎమ్మెల్యే సంజ య్‌  కుమార్‌ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అథితిగా భానుప్రపాద్‌ రావు హాజరై మాట్లాడారు. గత 30 సంవత్సారాల్లో చేయని అభివృధ్ది ఈ ఏడు సంవత్సరాల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిందని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి సీఎం కేసీఆర్‌ సభలు, సమావేశాలు, ప్లీనరీలు నిర్వహించి అనేక నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేసేలా చర్యలు చేపట్టారన్నారు.  మాజీ మంత్రి జీవన్‌రెడ్డి 30 ఏళ్లుగా జగిత్యాలలో అపార రాజకీయ అనుభవం ఉండి కూడా ఈ ప్రాంతాన్ని అభివృధ్ది చేయలేదని కేవలం ఏడేళ్లలోనే టీఆర్‌ఎస్‌ నాయకుడిగా, ఎమ్మెల్యేగా సంజయ్‌ కుమార్‌ అభివృధ్ది చేసి చూపించారన్నారు. బీజేపీ ఎంపీలు సంజయ్‌, అర్వింద్‌లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని వారికి దమ్ము, ధైర్యం ఉంటే తెలంగాణ రాష్ట్రానికి ఐటీఐఆర్‌, రైల్వే కోచ్‌ ప్యాక్టరీతో పాటు తెలంగాణకు రావాల్సిన తీసుకరావాలని డిమాండ్‌ చేశారు. బాండ్‌ పేపర్‌ ద్వారా మోసపూరిత మాటల ద్వారా ప్రజలు ఒకసారి మోస పోవచ్చని రాబోయే ఎన్నికల్లో అర్వింద్‌కు బుద్ది చెపుతారన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు పార్టీ సిద్దాంతాలను, పథకాలను ప్రజల్లోకి తీసుకవెళ్లా లని, ప్రతిపక్ష పార్టీల అసత్య ఆరోపణలను తిప్పికొట్టాలన్నారు. ఈ కార్యక్ర మంలో ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌, జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత, బల్దియా చైర్‌ పర్సన్‌ బోగ శ్రావణి, రాయికల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ హన్మాండ్లు, లైబ్రరీ చైర్మన్‌ చంధ్రశేఖర్‌గౌడ్‌, నియోజకవర్గంలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు ఉన్నారు.