వైద్య ఆరోగ్యశాఖపై సీఎం సమీక్ష

ABN , First Publish Date - 2021-11-11T00:45:56+05:30 IST

వైద్య ఆరోగ్యశాఖలో నాడు–నేడు, వైయస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్, కంటివెలుగు

వైద్య ఆరోగ్యశాఖపై సీఎం సమీక్ష

అమరావతి: వైద్య ఆరోగ్యశాఖలో నాడు–నేడు, వైయస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్, కంటివెలుగుతో పాటు ప్రాధాన్య కార్యక్రమాలపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎ‌స్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. వైఎ‌స్సార్‌ హెల్త్‌ క్లినిక్స్‌ పనులను వేగవంతం చేయాలని అధికారులను జగన్‌ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10,011 వైఎ‌స్సార్‌ హెల్త్‌ క్లినిక్స్‌ నిర్మించాలన్నారు. వీటి నిర్మాణాలను కూడా మరింత వేగంగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. 16 కొత్త మెడికల్‌ కాలేజీల్లో పనుల ప్రగతిని సీఎం సమీక్షించారు. ఇప్పటికే నాలుగు చోట్ల పనులు మొదలయ్యాయని, మిగిలిన చోట్ల నిర్మాణాలకు సన్నాహలను పూర్తిచేస్తున్నామని సీఎంకు అధికారులు తెలిపారు. కర్నూలు జిల్లా నంద్యాల, విశాఖజిల్లా అనకాపల్లి మెడికల్‌ కాలేజీ స్థలాలపై కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాని అధికారులు పేర్కొన్నారు. వీటిని త్వరగా పరిష్కరించేలా చూడాలని సీఎం ఆదేశాలు జారీ చేసారు. ఇవికాకుండా 9 చోట్ల జరుగుతున్న సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రులపై కూడా చర్చించారు. 


Updated Date - 2021-11-11T00:45:56+05:30 IST