విదేశీ గడ్డపై Tamil పీఠాలు

ABN , First Publish Date - 2022-01-23T14:40:58+05:30 IST

ఆగ్నేయ ఆసియాలోని ఐదు విదేశీ విశ్వవిద్యాలయాల్లో సెమ్మొళి తమిళ పీఠాలు నెలకొల్పనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రకటించారు. కోట్టూరుపురంలోని అన్నా శతజయంతి స్మారక గ్రంథాలయం ఆడిటోరి

విదేశీ గడ్డపై Tamil పీఠాలు

- ఆగ్నేయాసియాలోని ఐదు విశ్వవిద్యాలయాల్లో ఏర్పాటు: సీఎం స్టాలిన్‌  

- ఇక మేడవాక్కం- చోళింగనల్లూరు రోడ్డు ‘సెమ్మొళి సాలై’

- 8 మందికి సెమ్మొళి తమిళ అవార్డులు


చెన్నై: ఆగ్నేయ ఆసియాలోని ఐదు విదేశీ విశ్వవిద్యాలయాల్లో సెమ్మొళి తమిళ పీఠాలు నెలకొల్పనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రకటించారు. కోట్టూరుపురంలోని అన్నా శతజయంతి స్మారక గ్రంథాలయం ఆడిటోరియంలో శనివారం ఉదయం నిర్వహించిన ప్రత్యేక సభలో వివిధ రంగాల్లో తమిళభాష ఔన్నత్యానికి సేవలందించిన ఎనిమిది మంది తమిళ ప్రముఖులకు ‘కరుణానిధి సొమ్మొళి తమిళ అవార్డు’లను ఆయన ప్రదానం చేశారు. దివంగత మాజీ ముఖ్య మంత్రి కరుణానిధి కేంద్ర సెమ్మొళి తమిళ పరిశోధనా కేంద్రంలో కోటి రూపాయలతో ప్రత్యేక ట్రస్టును ఏర్పాటు చేశారు. ఆ ట్రస్టు ద్వారా తమిళ ప్రాచీన శాసనాలు, ప్రాచీన తమిళ నాణేలు, సాహిత్యం, అనువాదం తదితర తమిళ భాషా సంబంధింత అంశాలపై పరిశోధనలు చేసి సేవలందించే ప్రముఖులకు ప్రతియేటా అవార్డులివ్వాలని ఉత్తర్వు జారీ చేశారు. 2010లో కోవైలో జరిగిన ప్రపంచ తమిళ సొమ్మొళి మహానాడులో ఫిన్లాండ్‌కు చెందిన ప్రొఫెసర్‌ ఆస్కో పర్పోలాకు తొలి అవార్డును ప్రదానం చేశారు. 2010 నుంచి 2019 వరకూ గత అన్నాడీఎంకే ప్రభుత్వ హాయంలో ఈ అవార్డుల పంపిణీ జరగలేదు. డీఎం కే అధికారంలోకి రాగానే ఈ అవార్డులను ప్రదానం చేయనున్నట్లు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రకటించారు. ఆ మేరకు పది మంది ప్రముఖులను ఈ అవార్డుల కోసం ఎంపిక చేశారు. మద్రాసు విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ పొన్‌ కోదండరామన్‌, తమిళ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ ఇ.సుందరమూర్తి, పుదుచ్చేరి విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ పి.మరుద నాయగం, మద్రాసు విశ్వవిద్యాలయంలోని తిరుక్కురళ్‌ పరిశోధనా విభాగం ప్రొఫెసర్‌ కే మోహన్‌రాజు, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాల తమిళ ఫ్రొఫెసర్‌ మరైమలై ఇలక్కువనార్‌, పుదుచ్చేరి విశ్వవిద్యాలయం చారిత్రక విభాగం ప్రొఫెసర్‌ కే రాజన్‌, చెన్నై న్యూ కాలేజీ ఫ్రొఫెసర్‌ ఈరోడ్‌ తమిళ్‌ అన్బన్‌, తంజావూరు, తిరునల్వేలిలోని తిరువళ్ళువర్‌ కళాశాల ప్రొఫెసర్‌ కే శివమణి అవార్డులను అందుకున్నారు. ఈ అ వార్డులకు ఎంపికైన అమెరికాలోని పెన్సుల్వేనియా విశ్వవిద్యాలయం సీనియర్‌ లెక్చరర్‌ వీఎస్‌ రాజం, జర్మనీలోని కొలోజిన్‌ విశ్వవిద్యా లయం తమిళ అధ్యయన విభాగం ప్రొఫెసర్‌ ఉలరిక్‌ నిక్‌లాస్‌ అనివార్యకారణాల వల్ల రాలేక పోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ అవార్డుల ప్రదానోత్సవ సభలో స్టాలిన్‌ ప్రసంగిస్తూ డీఎంకే ప్రభుత్వ హాయంలోనే తమిళ భాషా సాహిత్యం, పరిశోధన ఇలా అన్ని విభాగాల్లోనూ అభివృద్ధి చెందుతోందని వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా తమిళ భాషాభివృద్ధి కోసం తమ ప్రభుత్వం పాటుపడుతోందని, ఆ మేరకు ఆగ్నేయాసియాలోని ఐదు విదేశీ విద్యాలయాలలో తమిళ అధ్యయన పీఠాలను నెలకొల్పనున్నామని సభికుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఇదే విధంగా కేంద్ర సెమ్మొళి తమిళ పరిశోధనా సంస్థ ఉంటున్న మేడవాక్కం- చోళింగనల్లూరు రోడ్డు పేరును ‘సెమ్మొళి సాలై’గా మార్చనున్నామని, త్వరలో ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వు జారీ అవుతుందని స్టాలిన్‌ తెలిపారు.‘అంతటా తమిళం అన్నింటా తమిళం’ అంటూ తమిళ భాషాభివృద్ధికి తమ ప్రభుత్వం అన్ని విధాలా పాటుపడుతుందని ఆయన శపథం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దురైమురుగన్‌, పొన్ముడి, తంగం తెన్నరసు, ఎం.సుబ్రమణ్యం, అన్బిల్‌ మహేష్‌ పొయ్యామొళి, శాసనసభ్యులు ఏఎంవీ ప్రభాకర్‌రాజా, కే గణపతి, తమిళ భాషాభివృద్ధి సమాచారశాఖ డిప్యూటీ కార్యదర్శి మహేశన్‌ కాశిరాజన్‌, కేంద్ర సెమ్మొళి పరిశోధనా సంస్థ డిప్యూటీ అధ్యక్షులు ప్రొఫెసర్‌ ఇ. సుందర మూర్తి, డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఇరా చంద్రశేఖరన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-23T14:40:58+05:30 IST