రాష్ట్రాన్ని నెంబర్‌వన్‌ చేయడమే లక్ష్యం

ABN , First Publish Date - 2022-01-28T15:37:57+05:30 IST

ముఖ్యమంత్రిగా నెంబర్‌ వన్‌ అనిపించుకోవడం కన్నా, తమిళనాడు నెంబర్‌ వన్‌ స్థానం అని పిలిపించుకొనే పరిస్థితులు రావాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ అన్నారు. డీఎంకే అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు టీకేఎస్‌ ఇళంగోవన్‌ ఇం

రాష్ట్రాన్ని నెంబర్‌వన్‌ చేయడమే లక్ష్యం

                              -  ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌


ప్యారీస్‌(చెన్నై): ముఖ్యమంత్రిగా నెంబర్‌ వన్‌ అనిపించుకోవడం కన్నా, తమిళనాడు నెంబర్‌ వన్‌ స్థానం అని పిలిపించుకొనే పరిస్థితులు రావాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ అన్నారు. డీఎంకే అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు టీకేఎస్‌ ఇళంగోవన్‌ ఇంటి వివాహ వేడుకల్లో పాల్గొన్న సీఎం స్టాలిన్‌, కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి పాల్గొన్నారు. ఈ వేడుకల్లో కేఎస్‌ అళగిరి మాట్లాడుతూ, మన ముఖ్యమంత్రి ఎలాంటి వేదికపై ఎక్కువగా మాట్లాడరని, కూటమిలోని పలు పార్టీల నేతలతో కూడి ఎక్కువ మాట్లాడతారన్నారు. ఈ విషయమై సీఎం స్పందిస్తూ, తక్కువ మాట్లాడి ప్రతిభను ప్రదర్శించాలనే తపనతో తాను పనిచేస్తున్నానన్నారు. నేను చేసే పనులకు మీరందరూ పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నా రని తెలుసు. ఇంకా నేను గర్వంగా మాట్లాడాల్సి వస్తే, దేశంలోని పలు రాష్ట్రాలతో పోల్చితే, ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల పనితీరుపై నిర్వ హించిన సర్వేలో, తమిళనాడు ముఖ్యమంత్రి అగ్రస్థానం అని చెప్పడం గర్వంగా ఉందన్నారు. దానిని నేను మర్చిపోలేను. ముఖ్యమంత్రి నెంబరు వన్‌ అని చెప్పడం కన్నా, తమిళనాడు నెంబరు వన్‌ అనే స్థాయికి అభివృద్ధి సాధించాలి. అందుకోసమే తమ ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం అన్నారు.

Updated Date - 2022-01-28T15:37:57+05:30 IST