రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్యం: స్టాలిన్

ABN , First Publish Date - 2021-12-20T21:44:33+05:30 IST

ప్రమాదంలో గాయపడ్డ బాధితులకు ముఖ్యమంత్రి సమగ్ర ఆరోగ్య బీమా పథకం (సీఎంసీహెచ్‌ఐఎస్) లక్ష రూపాయల వరకు ఈ పథకం వర్తిస్తుందట. ఈ పథకం ద్వారా 81 రకాల గుర్తింపు పొందిన విధానాల ద్వారా అమలు జరగనుందట..

రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్యం: స్టాలిన్

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సోమవారం కీలక ప్రకటన చేశారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఎవరికైనా ఉచితంగా వైద్యం అందిస్తామని ఆయన ముఖ్యమంత్రి సమగ్ర ఆరోగ్య బీమా పథకం (సీఎంసీహెచ్‌ఐఎస్) అనే కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టే సందర్భంగా పేర్కొన్నారు. శనివారం ఈ ప్రకటన చేసిన అనంతరమే ఈ పథకం అమలులోకి వస్తుందని ఆయన తెలిపారు. అన్నట్లుగానే తాజాగా రాష్ట్రంలోని ఇన్నుయిర్ కాప్పొన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారికి 48 గంటలపాటు ఉచిత చికిత్స అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 609 ఆసుపత్రులను గుర్తించారు. ఇందులో ప్రభుత్వ ఆసుపత్రులు 201, ప్రైవేటు ఆసుపత్రులు 408 ఉన్నాయి. ఈ ఆసుపత్రుల్లో రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్య సేవలు అందించనున్నారు.


ప్రమాదంలో గాయపడ్డ బాధితులకు ముఖ్యమంత్రి సమగ్ర ఆరోగ్య బీమా పథకం (సీఎంసీహెచ్‌ఐఎస్) లక్ష రూపాయల వరకు ఈ పథకం వర్తిస్తుందట. ఈ పథకం ద్వారా 81 రకాల గుర్తింపు పొందిన విధానాల ద్వారా అమలు జరగనుందట. ఇక మొదటి 48 గంటల పాటు ఈ ఉచిత వైద్య సదుపాయం ఉంటుందని తెలిపారు. ఇది కేవలం తమిళనాడు ప్రజలకే కాకుండా తమిళనాడులోని ఏ ప్రాంతంలోనైనా గాయపడ్డ తమిళేతరులకు ఇతర దేశాల వారికి కూడా వర్తిస్తుందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. చికిత్స పొందుతున్న సమయంలో బాధితులు తమకు నచ్చిన ఆసుపత్రికి మార్చుకునే సదుపాయాన్ని కూడా కల్పించారు.

Updated Date - 2021-12-20T21:44:33+05:30 IST