Abn logo
Aug 15 2020 @ 04:27AM

ఉదయానంద ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం

 నంద్యాల, ఆగస్టు 14: నంద్యాలలో నూతనంగా నిర్మించిన 200 పడకల ఉదయానంద మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. శుక్రవారం ఉదయానంద ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్‌ ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ ఆసుపత్రికి డైరెక్టర్లుగా  పార్లమెంట్‌ సభ్యుడు పోచా బ్రహ్మానందరెడ్డి, డి.పరమేశ్వరరెడ్డి, ఎన్‌ రామకృష్ణారెడ్డి  వ్యవహరిస్తున్నారు.


మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, కలెక్టర్‌ వీర పాండియన్‌, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, టి. ఆర్థర్‌, శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి, గంగుల బిజేంద్రారెడ్డి, ఎస్పీ డాక్టర్‌ కె.ఫక్కీరప్ప ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.  అనంతరం సీఎం జగన్‌ మాట్లాడుతూ నంద్యాలలో అత్యాధునిక సౌకర్యాలతో ఆసుపత్రిని నిర్మించినందుకు డైరెక్టర్లను అభినందించారు. కార్యక్రమంలో నంద్యాల సబ్‌ కలెక్టర్‌ కల్పనాకుమారి, ఉదయానంద ఆసుపత్రి వైద్యులతో పాటు పట్టణంలోని ప్రముఖ వైద్యులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement