సీజ్‌ చేసిన వాహనాలు ఇచ్చేయండి కానీ..: జగన్

ABN , First Publish Date - 2020-05-24T04:33:32+05:30 IST

కరోనా నేపథ్యంలో యావత్ దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే...

సీజ్‌ చేసిన వాహనాలు ఇచ్చేయండి కానీ..: జగన్

అమరావతి : కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో యావత్ దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో కూడా వాహనాలు, జనాలు ఎక్కువగా బయటికి తిరగడంతో కఠిన నిబంధనలు విధించారు. అయితే నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడం.. పలు వాహనాలు సీజ్ చేయడం జరిగింది. అయితే ఆ సీజ్ చేసిన వాహనాలన్నీ తిరిగిచ్చేయాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు సీజ్ చేసిన వాహనాలన్నీ వెంటనే విడుదల చేయాలని పోలీసు ఉన్నతాధికారులను జగన్ ఆదేశించారు.


కండిషన్స్ అప్లై..!

అయితే.. వాహనాలు తీసుకునే ముందు మళ్లీ ఇలా నియమాలను ఉల్లఘించబోమంటూ వాహనదారులనుంచి హామీపత్రాన్ని తీసుకోవాలని పోలీసులకు జగన్ సూచించారు. శనివారం నాడు లాక్‌డౌన్‌ పరిస్థితులపై అధికారులతో జరిగిన సంభాషణలో సీఎం ఈ ఆదేశాలు జారీ చేశారు. కాగా.. రూ.100ల జరిమానాకు పరిమితం చేయాలని అధికారులకు సీఎం స్పష్టంచేశారు. అదే విధంగా వాహనాలు అప్పగించేటప్పుడు వారికి  కోవిడ్‌-19 నివారణా జాగ్రత్తలపై అవగాహన కూడా కల్పించాలని పోలీసు అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.

Updated Date - 2020-05-24T04:33:32+05:30 IST