టీటీడీ భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై సీఎం జగన్ సమీక్ష

ABN , First Publish Date - 2021-10-12T18:37:25+05:30 IST

తిరుమలలో శ్రీవారి భక్తులకు టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.

టీటీడీ భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై సీఎం జగన్ సమీక్ష

తిరుపతి: తిరుమలలో శ్రీవారి భక్తులకు టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఆయన చర్చించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో మంత్రులు నారాయణస్వామి, పెద్దిరెడ్డి, కన్నబాబు, వెల్లంపల్లితోపాటు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తదితరులు హాజరయ్యారు. టీటీడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గోసేవా, నవనీత సేవలపై సీఎంకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఈవో వివరించారు.


శ్రీవారి పుష్ప కైంకర్యాలకు వినియోగించే పుష్పాలతో టీటీడీ తయారు చేస్తున్న అగర్ బత్తీలు, స్వామివారి చిత్రపటాలు, క్యాలండర్లతో పాటు ఇతర వస్తువులను జగన్ పరిశీలించారు. ఈ సందర్భంగా టీటీడీ చేపడుతున్న కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రశంసించారు. సంప్రదాయ వ్యవసాయ పద్ధతులపై సీఎం సమక్షంలో టీటీడీ ఈవో, రైతు సాధికార సంస్థ వైస్ ఛైర్మన్ విజయ్ కుమార్ ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఈ ఏడాది మే నుంచి గో ఆధారిత వ్యవసాయంతో పండించిన పదార్థాలతో శ్రీవారికి నైవేధ్యం సమర్పిస్తారు.

Updated Date - 2021-10-12T18:37:25+05:30 IST