విజయవాడ, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): సిక్కు మత గురువు గురునానక్ 551వ జయంతి సంద్భంగా విజయవాడ గురునానక్‌నగర్‌లోని గురుద్వారాలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గురుద్వారాలో నిర్వహించిన గురుబాని కీర్తనల్లో సీఎం పాల్గొన్నారు. గురుద్వార పూజారి రామ్‌సింగ్ సీఎం జగన్‌కు కిర్పాన్ (కత్తి)ను బహుకరించారు.