పథకాల అమల్లో దేశానికే తెలంగాణ ఆదర్శం

ABN , First Publish Date - 2021-01-16T05:47:46+05:30 IST

పథకాల అమల్లో దేశానికే తెలంగాణ ఆదర్శం

పథకాల అమల్లో దేశానికే తెలంగాణ ఆదర్శం

  • ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్‌

ఆమనగల్లు : సంక్షేమ పథకాల అమలులో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్‌ అన్నారు. ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల మండలాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను శుక్రవారం ఆమనగల్లులో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు గోలి శ్రీనివా్‌సరెడ్డితో కలిసి ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో లాలయ్యగౌడ్‌, రమే్‌షరెడ్డి, జంగయ్యగౌడ్‌, శంకర్‌నాయక్‌, కృష్ణారెడ్డి, జాపాల్‌నాయక్‌, వెంకటమ్మ, సత్తయ్య, జైపాల్‌రెడ్డి, పవన్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.  ఆమనగల్లు పట్టణానికి చెందిన టీఆర్‌ఎస్‌ నాయకుడు రేవళ్లి అచ్చయ్యకు గురువారం బ్రెయిన్‌స్ర్టోక్‌ రావడంతో కుటుంబసభ్యులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌, టీఆర్‌ఎస్‌ ఆమనగల్లు మున్సిపల్‌ కన్వీనర్‌ అప్ప శ్రీను, మైనార్టీ నాయకుడు సయ్యద్‌ ఖలీల్‌ శుక్రవారం ఆసుపత్రికి చేరుకుని అచ్చయ్యను పరామర్శించారు. చికిత్స నిమిత్తం అతని భార్యకు రూ.5వేలు ఆర్ధికసాయం అందజేశారు.         

Updated Date - 2021-01-16T05:47:46+05:30 IST