Abn logo
Jun 12 2021 @ 00:02AM

సీఎంఆర్‌ఎఫ్‌ పేదలకు వరం

మేడ్చల్‌/ఘట్‌కేసర్‌ రూరల్‌: సీఎం సహాయ నిధి పేదలకు వరమని ఎంపీపీ పద్మజగన్‌రెడ్డి అన్నారు. సోమారం గ్రామానికి చెందిన నరసింహ, కళావతిలు అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సీఎంఆర్‌ఎఫ్‌కు దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ.25 వేలు, రూ.60 వేల చెక్కులను శుక్రవారం ఎంపీపీ చేతులమీదుగా అందజేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు రాజు, సర్పంచ్‌ కరుణాకర్‌రెడ్డి, ఎంపీటీసీ కుమార్‌, గౌడవెల్లి మాజీ సర్పంచ్‌ జగన్‌రెడ్డి పాల్గొన్నారు. ఘట్‌కేసర్‌ మండలంలోని కొర్రెముల గ్రామానికి చెందిన ప్రసాద్‌కు శుక్రవారం  సర్పంచ్‌ ఓరుగంటి వెంకటే్‌ష్‌ రూ.40వేల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ కందుల రాజు, టీఆర్‌ఎస్‌ గ్రామ శాఖ అధ్యక్షుడు సంతో్‌షగౌడ్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement