సీఎంఆర్ఎఫ్‌కు వైసీపీ శ్రేణుల భారీ విరాళం

ABN , First Publish Date - 2020-08-06T02:39:53+05:30 IST

కోవిడ్‌ –19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరపున కోటి రూపాయలు విరాళం

సీఎంఆర్ఎఫ్‌కు వైసీపీ శ్రేణుల భారీ విరాళం

అమరావతి: కోవిడ్‌ –19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరపున కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. ఈ విరాళానికి సంబంధించిన చెక్కును ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌కు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి అందజేశారు. ఎమ్మెల్యే వెంట అన్నె చిట్టిబాబు, రాజులపాటి రామచంద్రరావు, దోనేపూడి కిరణ్, హనుమంతరావు ఉన్నారు.

Updated Date - 2020-08-06T02:39:53+05:30 IST