కో- ఆప్షన ఎవరికో ?

ABN , First Publish Date - 2021-04-19T06:25:45+05:30 IST

మున్సిపాలిటీలకు నూతన పాలకవర్గాల ఏర్పాటు జరిగిన తర్వాత ఇప్పుడు కో-ఆప్షన సభ్యుల తంతు మిగిలి ఉంది. ప్రతి పాలకవర్గానికి ఆ సభ్యుల ఎంపిక తప్పనిసరి. కో-ఆప్షన సభ్యుల ఎన్నిక కోసం ఈనెల 16వ తేదీన పురపాలక శాఖ మార్గదర్శకాలిచ్చింది. పాలకవర్గ మొదటి సమావేశం నిర్వహించిన 60 రోజుల్లోపు కో ఆప్షన సభ్యుల ఎన్నికల ప్రక్రి య పూర్తి చేయాలని సంబంధిత కమిషనర్లకు సూచించింది.

కో- ఆప్షన ఎవరికో ?

మున్సిపాల్టీలు, కార్పొరేషనలో కో-ఆప్షన సభ్యుల ఎంపికకు మార్గదర్శకాలు జారీ 

నగరపాలక సంస్థకు ఐదుగురు

మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ముగ్గురు

కార్పొరేషనలో తీవ్ర పోటీ

చాలా చోట్ల అధికార పార్టీలో అసంతృప్తుల సెగ

అనంతపురం కార్పొరేషన, ఏప్రిల్‌18 : మున్సిపాలిటీలకు నూతన పాలకవర్గాల ఏర్పాటు జరిగిన తర్వాత ఇప్పుడు కో-ఆప్షన సభ్యుల తంతు మిగిలి ఉంది. ప్రతి పాలకవర్గానికి ఆ సభ్యుల ఎంపిక తప్పనిసరి.  కో-ఆప్షన సభ్యుల ఎన్నిక కోసం ఈనెల 16వ తేదీన పురపాలక శాఖ మార్గదర్శకాలిచ్చింది. పాలకవర్గ మొదటి సమావేశం నిర్వహించిన 60 రోజుల్లోపు కో ఆప్షన సభ్యుల ఎన్నికల ప్రక్రి య పూర్తి చేయాలని సంబంధిత కమిషనర్లకు సూచించింది. నగరపాలక సంస్థలో ఐదుగురు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ముగ్గురు సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. జిల్లాలో అనంతపురం నగరపాలక సంస్థ, హిందూపురం, గుంతకల్లు, ధర్మవరం, కదిరి, తాడిపత్రి, గుత్తి, కళ్యాణదుర్గం, రాయదుర్గం మున్సిపాలిటీలు, మడకశిర, పుట్టపర్తి నగర పంచాయతీల్లో సభ్యుల ఎన్నిక జరగనుంది. మిగిలిన మున్సిపాల్టీల మాటెలా ఉన్నా ఈ కో-ఆప్షన సభ్యుల ఎన్నిక విషయం అనంతపురం నగరపాలక సంస్థలో అధికార పార్టీ నేతలకు కొంత తలనొప్పిగా ఉం టుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఎన్నికకు సంబంధించి కార్పొరేషనలో తీవ్ర పోటీ ఉంటుందనేది సుస్పష్టం. మేయర్‌, డిప్యూటీ మేయర్‌, మున్సిపల్‌ చైర్మన, వైస్‌ ఛైర్మన ఎన్నిక తరువాత జరగనున్న కో ఆప్షన సభ్యుల ఎన్నికతో రాజకీయ నాయకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 


కోఆప్షన సభ్యుల ఎన్నిక ఇలా...

కోఆప్షన సభ్యుల ఎన్నిక విషయంలో కొన్ని నిబంధ నలున్నాయి. అనంతపురం కార్పొరేషనలో మొత్తం ఐదు గురు కోఆప్షన సభ్యులకు గాను ఇద్దరు మైనార్టీలు, మరో ముగ్గురు పరిపాలనపై అవగాహన కలిగిన మాజీ ప్రజా ప్రతినిధులు, విశ్రాంత అధికారులు, ఉద్యోగులై ఉండాలి. అంటే ఇక్కడ మాజీ కార్పొరేటర్లకు ఎక్కువ అవకాశం ఉం టుంది. మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో ము గ్గురు సభ్యులకు గాను ఇద్దరు మైనార్టీ వర్గానికి చెందిన వారు, మరొకరు మున్సిపల్‌ అడ్మినిస్ర్టేషనపై అవగాహన కలిగిన వారుండాలి. కోఆప్షన సభ్యుల స్థానాలకు దరఖాస్తు చేసుకునేవారు ఆయా కార్పొరేషన, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఓటరై ఉండి 21 ఏళ్లు నిండి ఉండాలి. దర ఖాస్తు చేసిన వారిలో సభ్యుల ఎన్నిక కోసం మేయర్‌, చైర్మన అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించి... కార్పొ రేషనలో కార్పొరేటర్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కౌన్సిలర్లు చేతులెత్తి కోఆప్షన సభ్యులను ఎన్నుకునేలా ఏర్పాట్లు చేయాలని పురపాలక శాఖ ఆదేశాలు జారీ చేసింది. పాలకవర్గం ఏర్పాటైన తొలి సమావేశం నుంచి 60 రోజుల్లోపు కోఆప్షన సభ్యుల ఎంపిక జరగాలి. జిల్లాలో కార్పొరేషనతో పాటు అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో తొలి సమావేశం జరిగి ఆదివారంతో నెలరోజులు గడిచింది. మరో నెల రోజుల్లోపు సభ్యుల ఎన్నిక జరగాల్సి ఉంటుంది.  


నగరపాలక సంస్థలో తీవ్ర పోటీ...

జిల్లాలో తాడిపత్రి మినహా అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ హవానే నడిచింది. హిందూపురం, కళ్యాణదుర్గం మున్సిపాల్టీల్లో చైర్మన, వైస్‌ చైర్మన ఎన్నిక విషయంలో అసంతృప్తి బయటపడింది. కోఆప్షన సభ్యుల విషయంలోనూ అది ఎక్కువయ్యే అవకా శమున్నట్లు తెలుస్తోంది. ఇక తాడిపత్రిలో వైసీపీ, టీడీపీల మ ధ్య పోటీ బలంగా ఉంటుంది. ఇక మిగిలిన మున్సి పాలిటీలు, నగర పంచాయతీల్లో సైతం కొంతవరకు పోటీ ఉండనుండటంతో అసంతృప్తుల సెగ నాయకులు తగల నుంది. అనంతపురం నగరపాలక సంస్థలో కోఆప్షన స భ్యుల ఎన్నికకు పోటీ ఎక్కువగా ఉంటుందనే వాదన విని పిస్తోంది. దాదాపు 30 మంది వరకు ఆ పదవి కోసం ఎమ్మెల్యే అనంత ఇంటి చుట్టూ చక్కర్లు కొడుతున్నట్లు తెలి సింది. మొత్తం 50 డివిజన్లకు 48 డివిజన్లు వైసీపీ అభ్య ర్థులు, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు గెలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు సంబంధించే పార్టీలో కొందరు నేతలు గుర్రుగా ఉన్నారు. దీంతో ఆ పార్టీలో స్తబ్ధత ఏర్పడిందని పార్టీ శ్రేణులే పేర్కొంటున్నాయి. కోఆప్షన సభ్యుల ఎన్నిక విషయంలో అది మరింత రాజుకునే అవకాశం లేకపోలేదు. ఐదుగురికి గాను ప్రధానంగా లక్ష్మీఉమామహేశ్వరి, రహమతబీ, ఉష, సుశీలమ్మ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరిలో మొదటి ముగ్గురు వైసీపీ తరపున వరుసగా 15, 16, 20వ డివిజన్లలో నామినేషన్లు వేసి ఆ పార్టీ కీలక నేతల సూచనలతో పోటీ నుంచి వైదొలిగారు. సుశీలమ్మ మాజీ కార్పొరేటర్‌గా పనిచేశారు. ఇక మాజీ కార్పొరేటర్ల నుంచి పోటీ అధికంగానే ఉంది. వారిలో రషీద్‌ అహ్మద్‌, లక్ష్మిరెడ్డి, బంగి సుదర్శన, వెంకటక్రిష్ణ, ఆకుల మునిశంకరయ్య, లక్ష్మీప్రసన్న పేర్లు ముందు వరుసలో ఉన్నాయి. వీరిలో ఎన్నికల సమయంలో టీడీపీ నుంచి వచ్చిన వారు కూడా ఉ న్నారు. ఇప్పటికే పార్టీలో క్రియాశీలకంగా పనిచేయకపోయినా పదవులు కట్టబెట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో టీడీపీ నుంచి కొత్తగా చేరిన వారికి కోఆప్షన సభ్యులుగా అవకాశం ఇస్తారా..? లేక వివాదాలెందుకులే  అని పార్టీలో పాతవారినే ఎంపికచేస్తారా  అనేది తేలాల్సి ఉంది. ఇవి కాకుండా హామీలు పుచ్చుకున్న వారు మరో 15 మంది వరకు ఉండవచ్చని తెలుస్తోంది. మరి వారిలో ఎవరెంత మేరకు ఆ పదవి దక్కించుకుంటారో వేచి చూడాల్సిందే. 

Updated Date - 2021-04-19T06:25:45+05:30 IST