కోల్ ఇండియా ఉద్యోగి కుమార్తె చికిత్సకు రూ.16కోట్ల సాయం

ABN , First Publish Date - 2021-11-22T03:33:23+05:30 IST

సతీష్ కుమార్ రవి, చత్తీస్‌గఢ్‌లోని దీప్కాలోని కోల్ ఇండియా సంస్థలో పని చేస్తున్నాడు. అయితే కొద్ది రోజుల క్రితం నుంచి తన కూతురు సృష్టి ఆరోగ్యం బాగాలేదు. విషయం తెలుసుకుని కోల్ ఇండియా యాజమాన్యానికి సమాచారం అందించాడు...

కోల్ ఇండియా ఉద్యోగి కుమార్తె చికిత్సకు రూ.16కోట్ల సాయం

న్యూఢిల్లీ: కోల్ ఇండియా గొప్ప మనసు చాటుకుంది. తమ కంపెనీలో పని చేస్తున్న ఒక ఉద్యోగి కుమార్తె ఆరోగ్యం కోసం ఏకంగా 16 కోట్ల రూపాయలను విడుదల చేసింది. స్పైనల్ మస్కులర్ అట్రోఫీతో బాధపడుతున్న రెండేళ్ల సృష్టి అనే చిన్నారికి జోల్గేన్‌స్మా అనే ఇంజెక్షన్‌కు ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు అవుతాయట. ఆమె కోలుకోవడానికి ఇంతకు మించి వేరే మార్గం కూడా లేదట. ఈ విషయం తెలుసుకున్న కోల్ ఇండియా.. ఆ ఇంజెక్షన్‌కు అయ్యే మొత్తాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చింది.


సతీష్ కుమార్ రవి, చత్తీస్‌గఢ్‌లోని దీప్కాలోని కోల్ ఇండియా సంస్థలో పని చేస్తున్నాడు. అయితే కొద్ది రోజుల క్రితం నుంచి తన కూతురు సృష్టి ఆరోగ్యం బాగాలేదు. విషయం తెలుసుకుని కోల్ ఇండియా యాజమాన్యానికి సమాచారం అందించాడు. ‘‘సతీష్ లాంటి చిరు ఉద్యోగులకు ఇంత పెద్ద మొత్తంలో డబ్బు పెట్టి అంత ఖరీదైన ఇంజెక్షన్‌ను కొనుగోలు చేయలేరు. అందుకే కోల్ ఇండియా యాజమాన్యం చర్చించి, సతీష్ కుమార్తె ప్రాణాలు కాపాడాలని, అందుకు సరిపడా డబ్బు కోల్ ఇండియా నుంచి సతీష్‌కు అందజేయాలని నిర్ణయించింది’’ అని సీనియర్ ఎస్‌ఈసీఎల్ అధికారి తెలిపారు.

Updated Date - 2021-11-22T03:33:23+05:30 IST