రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తిని వెలికితీయాలి

ABN , First Publish Date - 2021-10-27T06:29:42+05:30 IST

రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తిని వెలికి తీయాలని డైరెక్టర్‌ ఆఫ్‌ మైన్స్‌ సేఫ్టీ(డీఎంఎస్‌) శ్యామ్‌ మిశ్రా సూచించారు.

రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తిని వెలికితీయాలి
రక్షణ త్రైపాక్షిక సమావేశంలో మాట్లాడుతున్న డీఎంఎస్‌ శ్యామ్‌ మిశ్రా

- 17వ రక్షణ త్రైపాక్షిక సమావేశంలో డీఎంఎస్‌ శ్యామ్‌ మిశ్రా

గోదావరిఖని, అక్టోబరు 26: రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తిని వెలికి తీయాలని డైరెక్టర్‌ ఆఫ్‌ మైన్స్‌ సేఫ్టీ(డీఎంఎస్‌) శ్యామ్‌ మిశ్రా సూచించారు. ఆర్‌జీ-1 ఏరియా 17వ రక్షణ త్రైపాక్షిక సమావేశం మంగళవారం స్థానిక ఇల్లందు క్లబ్‌ లో నిర్వహించగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా శ్యామ్‌ మిశ్ర హాజరయ్యా రు. ముందుగా గని ప్రమాదంలో మృతిచెందిన వారికి మౌనం పాటించారు. అనంతరం రక్షణ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా డీఎంఎస్‌ మాట్లాడుతూ బొగ్గు గనుల్లో ప్రమాదాలు జరుగకుండా రక్షణ సూత్రాలుపాటించాలని, గాలి, వెలుతురు ఉండేవిధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రమాదాలను నివారిస్తూ ముందుకు వెళ్లాలని, గనుల్లో తీసుకుంటున్న రక్షణ చర్యలు, ప్రమాదాల నియంత్రణపై యాజమాన్యం తగు చర్యలు చేపట్టాలని గుర్తింపు సం ఘం టీబీజీకేఎస్‌ ఉపాధ్యక్షులు గండ్ర దామోదర్‌రావు సింగరేణి సంస్థకు సూ చించారు. సేఫ్టీ అధికారులు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఆర్‌జీ-1 జీఎం కల్వల నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమీక్ష సమావేశంలో డీడీఎంఎస్‌లు బద్రిష్‌కుమార్‌, బానోతు వెంకన్న, రఘు, గుర్తింపు సంఘం నాయకులు గండ్ర దామోదర్‌రావు, సేఫ్టీ జీఎం ఎల్‌వీ సూర్యనారాయణ, సీఎంఓఐఏ అధ్యక్షులు పొనగోటి శ్రీనివాస్‌, అధికారులు త్యాగరాజు, సత్యనారాయణ, చిలుక శ్రీనివాస్‌, శ్రీనాథ్‌, లక్ష్మీనారాయణ, మదన్‌మోహన్‌, నవీన్‌, సరోత్తం, ఆంజనేయులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-27T06:29:42+05:30 IST