Abn logo
Sep 27 2021 @ 00:47AM

గులాబ్‌ తుఫాన్‌తో తీరంలో అప్రమత్తం

వాడపాలెం తీరంలో ఒడ్డుకు చేర్చిన పడవలు

 

రాంబిల్లి, సెప్టెంబరు 26: తుఫాన్‌ కారణంగా ఆదివారం ఉదయం నుంచి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. వాడపాలెం, వాడనర్సాపురం, కొత్తపట్నం, వెంకయ్యపాలెం, లోవపాలెం తీరాల్లోని అలలు ఎగడిపడుతున్నాయి. సముద్రం ముందుకు చొచ్చుకురావ డంతో మత్స్యకారులు తమ పడవలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తహసీల్దార్‌ పి.భాగ్యవతి,  ఎస్‌ఐ రాజారావులు తీర ప్రాంతాల్లో పర్యటించి, మత్స్యకారులను అప్రమత్తం చేశారు. 

అచ్యుతాపురం: తుఫాన్‌ కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎలమంచిలి సీఐ వెంకటరమణ సూచించారు. పూడిమడక తీరాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. మంగళవారం వరకు తుఫాన్‌ ప్రభావం కొనసాగుతుందని,  మత్స్యకారులు  చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. అనంతరం ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి సూచనలు ఇవ్వడంతో పాటు పూడిమడకలో దండోరా వేయించారు. ఎస్‌ఐ ఉపేంద్ర ఆయన వెంట ఉన్నారు.

మునగపాక:  నర్సాపురం డ్యామ్‌ గేట్లను అధికారులు సకాలంలో ఎత్తడంతో గణపర్తి పరిసర ప్రాంతాల కు నీటి ముంపు ప్రమాదం తప్పింది. భారీ వర్షాలకు గణపర్తి వద్ద శారదా నది గట్టు కోతకు గురవ్వడంతో  ప్రమాదస్థాయి పెరిగింది. దీంతో ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యే రమణమూర్తిరాజు ఇరిగేషన్‌ అధికారులకు ఆదేశించడంతో ఎలమంచిలి సిబ్బంది నర్సాపురం డ్యా మ్‌ గేట్లు ఎత్తేందుకు ప్రయత్నం చేశారు. బోల్టు మొరాయించడంతో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు విశ్వప్రయత్నాలు చేసి చివరకు సఫలీకృతమయ్యారు. దీంతో నీటి ఉధృతి తగ్గడంతో గణపర్తి ప్రాంతానికి నీటి ముంపు సమస్య తప్పింది. ఈ కార్యక్రమంలో గణపర్తి సర్పంచ్‌ చదరం గణేశ్‌నాయుడు, యల్లపు జగ్గారావు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. 

ఎలమంచిలి: తుఫాన్‌ కారణంగా ఎలమంచిలిలో ఆదివారం ఉదయం నుంచి ముసురు వాతావరణం నెలకొంది. దీంతో జనజీవనానికి అంతరాయం ఏర్పడింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏటికొప్పాక వద్ద వరహా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.