నక్సల్స్‌ చెర నుంచి కోబ్రా కమాండో విడుదల

ABN , First Publish Date - 2021-04-09T07:07:28+05:30 IST

మావోయిస్టుల చెరలో ఉన్న కోబ్రా కమాండో రాకేశ్వర్‌ సింగ్‌ మన్‌హా్‌సకు విముక్తి లభించింది. ఛత్తీ్‌సగఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా తెర్రాం వద్ద ఈ నెల 3న నక్సల్స్‌, పోలీసులకు జరిగిన

నక్సల్స్‌ చెర నుంచి కోబ్రా కమాండో విడుదల

బీజాపూర్‌ చేరుకున్న రాకేశ్వర్‌ సింగ్‌

నలుగురు మధ్యవర్తులు, ఏడుగురు

విలేకరులతో చర్చలు.. వారే కీలకం!


చర్ల/చింతూరు/బీజాపూర్‌, ఏప్రిల్‌ 8: మావోయిస్టుల చెరలో ఉన్న కోబ్రా కమాండో రాకేశ్వర్‌ సింగ్‌ మన్‌హా్‌సకు విముక్తి లభించింది. ఛత్తీ్‌సగఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా తెర్రాం వద్ద ఈ నెల 3న నక్సల్స్‌, పోలీసులకు జరిగిన భీకర కాల్పుల అనంతరం.. రాకేశ్వర్‌ను నక్సల్స్‌ అపహరించిన విషయం తెలిసిందే. ఐదు రోజులపాటు వారి చెరలో ఉన్న కమాండోను గురువారం సాయంత్రం విడుదల చేశారు. మధ్యవర్తుల పేర్తు చెబితే.. కమాండోను విడుదల చేస్తామని మావోయిస్టులు ఇంతకు ముందే ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మేరకు ప్రభుత్వం సామాజిక కార్యకర్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత ధర్మపాల్‌ సైనీ, గోండ్వానా సమాజ్‌ అధ్యక్షుడు ఓరియా, మరో ఇద్దరితో మధ్యవర్తులను నియమించింది. వారితోపాటు.. ఏడుగురు జర్నలిస్టులు మధ్యవర్తులుగా వెళ్లారు. మధ్యవర్తులు, వందల మంది గ్రామస్థుల సమక్షంలో నక్సలైట్లు తెర్రాం పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో మధ్యాహ్నం 3 గంటల సమయంలో రాకేశ్వర్‌ను విడుదల చేశారు. తన తండ్రిని విడుదల చేయాలంటూ జవాన్‌ కుమార్తె శ్రాగ్వి కన్నీళ్లు పెట్టుకుంటూ మీడియా ద్వారా చేసిన విజ్ఞప్తితో కరిగిపోయిన మావోయిస్టులు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాకేశ్వర్‌ విడుదల వార్తను గురువారం సాయంత్రం ఆరు గంటలకు బస్తర్‌ రేంజ్‌ ఐజీ సుందర్‌రాజ్‌ పట్టిలింగం నిర్ధారించారు. మావోయిస్టుల చెర నుంచి విడుదలైన రాకేశ్వర్‌ నేరుగా బీజాపూర్‌లోని తన బెటాలియన్‌కు వెళ్లారు. అక్కడి యూనిట్‌ ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు.


బతిమాలిన విలేకరులు!

రాకేశ్వర్‌ సింగ్‌ విడుదలలో బస్తర్‌ విలేకరుల పాత్ర కీలకం. మధ్యవర్తులు చర్చలు జరుపుతున్న సమయంలో.. మావోయిస్టులు కొన్ని డిమాండ్లను ముందు పెట్టారని తెలిసింది. అయితే.. విలేకరులు వారితో వాదించారని సమాచారం. ‘‘ఇప్పటికే మీ(మావోయిస్టుల) పేరు చెడిపోయింది. సజీవంగా పట్టుకున్న జవానును విడుదల చేయకుంటే.. ఉన్న సానుభూతిని కూడా కోల్పోతారు’’ అని కొంత కఠినంగా చెప్పినట్లు తెలిసింది. మూడు గంటల పాటు చర్చలు జరుగుతున్నా.. ఎటూ తేలే పరిస్థితి కనిపించకపోవడంతో.. ఓ దశలో ‘‘మీకందరికీ పేరుపేరునా మొక్కుతాం. ఆ జవానును వదిలేయండి. ఆయన కూతురు పెట్టిన వీడియోను చూసైనా కనికరించండి’’ అని ప్రాధేయపడి.. చివరికి విడుదలకు ఒప్పించినట్లు సమాచారం.

Updated Date - 2021-04-09T07:07:28+05:30 IST