Advertisement
Advertisement
Abn logo
Advertisement

పాపం.. 4 అడుగుల ఈ నాగుపాముకు ఎంత కష్టమొచ్చింది..!

ఇంటర్నెట్ డెస్క్: మానవుల బాధ్యతారాహిత్యం.. మూగజీవాల పాలిట శాపంగా మారుతుంది. ఒడిశాలో ఓ మందు బాబు చేసిన పనికి.. సుమారు నాలుగు అడుగుల నాగుపాము నరకయాతన అనుభవించింది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


ఓ మందు బహిరంగ ప్రదేశంలో బీర్ తాగి.. ఆ ఖాళీ టిన్‌ను అక్కడే పడేసి వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే అటువైపుగా వచ్చిన ఓ నాగుపాము ఖాళీ టిన్ క్యాన్‌లో తల దూర్చింది. అంతే.. దాని తల అందులో ఇరుక్కుపోయింది. దీంతో ఆ పాము నరకయాతన అనుభవించింది. స్థానికులు ఈ విషయాన్ని గమనించి.. రెస్కూ టీంకు సమాచారం అందించడంతో.. అధికారులు వచ్చి ఆ పామును కాపాడారు. అనంతరం అడవిలో వదిలిపెట్టారు. దీంతో అది బతుకు జీవుడా అంటూ పరుగులు తీసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అదికాస్తా వైరల్ అయింది. Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement