ట్రంప్ తాగిన కొత్త రకం కాక్‌టెయిల్.. భారీ ఖర్చు పెట్టి కొనుక్కున్న ఆ దేశం!

ABN , First Publish Date - 2021-01-26T10:30:17+05:30 IST

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ తాగే కాక్‌టెయిల్‌ను భారీ మొత్తానికి కొనుగోలు చేయాలని యూరప్ దేశం జర్మనీ నిర్ణయించింది. అయితే ఇది మామూలు కాక్‌టెయిల్ కాదు. కరోనా రాకుండా మన శరీరంలో యాంటీ-బాడీలను వృద్ధి చేసే విధంగా ఈ

ట్రంప్ తాగిన కొత్త రకం కాక్‌టెయిల్.. భారీ ఖర్చు పెట్టి కొనుక్కున్న ఆ దేశం!

బెర్లిన్: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ తాగే కాక్‌టెయిల్‌ను భారీ మొత్తానికి కొనుగోలు చేయాలని యూరప్ దేశం జర్మనీ నిర్ణయించింది. అయితే ఇది మామూలు కాక్‌టెయిల్ కాదు. కరోనా రాకుండా మన శరీరంలో యాంటీ-బాడీలను వృద్ధి చేసే విధంగా ఈ కాక్‌టెయిల్‌ను తయారు చేశారు. దీన్నే ట్రంప్ కూడా తీసుకునేవారు. ఈ కాక్‌టెయిల్‌ను ఒక్కో డోసుకు సుమారు 2లక్షల రూపాయలు చెల్లించి కొనుగోలు చేస్తున్నట్లు జర్మనీ ఆరోగ్యశాఖ మంత్రి జెన్స్ స్పాన్ వెల్లడించారు. ‘‘ఈ కాక్‌టెయిల్ 2లక్షల డోసులను కొనుగోలు చేశాం. దీనికి 400 మిలియన్ యూరోలు ఖర్చయ్యాయి. అంటే ఒక్కో డోసుకు 2000 యూరోల(1,7లక్షల రూపాయలపైగా) వరకూ ఖర్చయిందన్నమాట’’ అని స్పాన్ వెల్లడించారు.

Updated Date - 2021-01-26T10:30:17+05:30 IST