Abn logo

కొబ్బరి సేమియా పాయసం

కావలసిన పదార్థాలు: కొబ్బరి పాలు - ఒక కప్పు, సేమియా - అరకప్పు, యాలకుల గింజలు - అర టీ స్పూను, నీరు - పావు కప్పు, జీడిపప్పు తరుగు - 2 టేబుల్‌ స్పూన్లు, కుంకుమపువ్వు కాడలు - 2, బెల్లం - 2 టేబుల్‌ స్పూన్లు.


తయారుచేసే విధానం: కడాయిలో కొద్దిగా నెయ్యివేసి సేమియా దోరగా వేగించి పక్కనుంచాలి. మరో కడాయిలో కొబ్బరిపాలు పోసి వేడిచేయాలి. తర్వాత అందులో నీరు, బెల్లం వేసి అడుగంటకుండా గరిటతో తిప్పుతూ ఉండాలి. రెండు నిమిషాలయ్యాక సేమియా వేసి ఒక పొంగు రాగానే చిటికెడు ఉప్పు వేసి మంట తగ్గించాలి. సేమియా చిక్కబడ్డాక జీడిపప్పు, కుంకుమపువ్వు కలిపి దించేయాలి. ఆ పాయసం మినప వడలతో కాంబినేషన్‌గా బాగుంటుంది.

శంకరపాలితిల్‌ పీఠాపైనాపిల్‌ హల్వాకొబ్బరి హల్వాకద్దూ కా హల్వాబీట్‌రూట్‌ హల్వాకొబ్బరి లడ్డుఇన్‌స్టంట్‌ జిలేబీస్వీట్‌ పనియారంక్యారెట్‌ బొబ్బట్లు
Advertisement