కోడింగ్‌ ప్రకటనలు నమ్మొచ్చా?

ABN , First Publish Date - 2020-08-01T07:59:03+05:30 IST

మా అబ్బాయి ఐదో తరగతి చదువుతున్నాడు. ‘కిడ్స్‌ కోడింగ్‌’ అంటూ కొన్ని ప్రకటనలు కన్పిస్తున్నాయి.

కోడింగ్‌ ప్రకటనలు నమ్మొచ్చా?

మా అబ్బాయి ఐదో తరగతి చదువుతున్నాడు. ‘కిడ్స్‌ కోడింగ్‌’ అంటూ కొన్ని ప్రకటనలు కన్పిస్తున్నాయి. వాటిని నమ్మొచ్చా? పిల్లలకి ప్రత్యేకంగా కోడింగ్‌ క్లాసులు అవసరమా? ఈ వయస్సులో ట్రైనింగ్‌ ఇప్పించవచ్చా? - సుమ, వైజాగ్‌


ఐదో తరగతిలో ప్రోగ్రామింగ్‌ మీద శిక్షణ ఇప్పించడం మంచిదే. ప్రపంచవ్యాప్తంగా చిన్న వయస్సులోనే మంచి పేరు తెచ్చుకున్న ప్రోగ్రామర్లు ఎంతోమంది ఉన్నారు. మీరు చెబుతున్న వ్యాపార ప్రకటనలు వేలాది రూపాయలు వసూలు చేస్తాయి. అంత ప్రత్యేక శ్రద్ధ కూడా వారు తీసుకోరు. పిల్లలకు ‘యుడెమీ, లింక్డిన్‌ లెర్నింగ్‌’ వంటి ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ పోర్టళ్లలో కోర్సులను అలవాటు చేస్తే బాగుంటుంది. ఇవి అందించే కోర్సులు కూడా వివరణాత్మకంగా ఉంటాయి. లేదంటే మీకు తెలిసిన బంధువులు, స్నేహితుల్లో అవగాహన ఉన్న వారి సాయం తీసుకోవచ్చు. అంతే తప్ప ఇలాంటి వ్యాపార ప్రకటనలను నమ్మి నిరాశకు గురికావొద్దు. 

Updated Date - 2020-08-01T07:59:03+05:30 IST